Ads
మామూలుగా మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న బ్రాండ్స్ కి ఒక డిఫరెంట్ పేరు అలాగే డిఫరెంట్ లోగో కూడా ఉండడం అన్నది కామన్. కొన్ని కొన్ని సార్లు ఆ బ్రాండ్ కు సంబంధించిన నేమ్ లేకపోయినా కూడా లోగోని చూసి అది ఏ బ్రాండ్ కి సంబంధించినది అని మనం గుర్తించవచ్చు. అయితే కొందరు ఒక కంపెనీకి సంబంధించిన వస్తువులను డూప్లికేట్ చేసి అదే లోగో పెట్టి మార్కెట్ లో విడుదల చేయడం చూస్తూనే ఉంటాం.
కొన్నిసార్లు సడన్ గా చూసి ఏది ఒరిజినల్? ఏది డూప్లికేట్? అనే విషయంలో కన్ఫ్యూస్ కూడా అవుతు ఉంటాం. అలాంటప్పుడు లోగోని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అందులో ఏదో ఒక చిన్న పొరపాటు ఉండే ఉంటుంది. ఆ చిన్న పొరపాటును బట్టి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనే విషయాన్ని బాగా ఐడెంటిఫై చేయవచ్చు.
Ads
ఇకపోతే హ్యుండాయ్ కంపెనీ మనందరికీ తెలిసిందే. హ్యుండాయ్ అంటే కొరియన్ లో మోడర్నిటీ అని అర్థం. హ్యుండాయ్ కంపెనీ లోగో కూడా మనందరికీ తెలుసు. లోగో అనగానే H అక్షరం మనలో చాలా మందికి మైండ్ లోకి వచ్చి ఉంటుంది. కానీ హ్యుండాయ్ లోగో లో ఉండేది H అక్షరం కాదు. హ్యుండాయ్ లోగోలో ఇద్దరు మనుషులు హ్యాండ్ షేక్ చేస్తూ ఉంటారు. అంటే హ్యుండాయ్ కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కి ప్రాముఖ్యతనిస్తుంది అని అర్థం. అలాగే లోగో సిల్వర్ కలర్ లో ఉంటుంది.
సిల్వర్ కలర్ బ్రాండ్ యొక్క సోఫిస్టికేషన్ అనగా అధునాతనని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీకు కూడా సందేహం కలిగే ఉంటుంది. కాబట్టి మీరు కూడా హ్యుండాయ్ లోగోను మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీకు కూడా ఇద్దరు మనుషులు హ్యాండ్ షేక్ చేస్తున్నట్లు కనిపిస్తారు. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. అందరూ అనుకుంటున్నారు కానీ దానిని హెచ్ సింబల్ ని అందరూ అనుకుంటూ ఉంటారు.