Ads
దేశంలో కష్టతరమైన ఎగ్జామ్స్ లో సివిల్స్ ఎగ్జామ్ ఒకటి. ప్రతి సంవత్సరం వేలమంది ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి రాసే వారు కూడా ఉన్నారు. అయితే మెయిన్స్, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా అసలు సిసలైన ఇంటర్వ్యూ దగ్గర చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఇంటర్వ్యూలో ఉండే ప్యానల్ అధికారులు అభ్యర్థిని కష్టపెట్టాలనే ఉద్దేశంతోటే సంక్లిష్ట ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు.
ఆ ప్రశ్నలకు అభ్యర్థి ఎంత సమయం స్ఫూర్తితో సమాధానం చెప్పాడు తన తెలివితేటలను ఎలా వాడాడు అనే వాటికి కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని ప్రశ్నలు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అడిగారు అంటూ. ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా అని ఆశ్చర్యానికి లోనైనా సందర్భాలు ఉంటాయి.
అయితే ప్రియ అనే ఐఏఎస్ అభ్యర్థిని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంటికి ఆ ప్రశ్న ఏంటంటే మీరు కలెక్టర్ గా ఒక జిల్లాకి పనిచేస్తున్నారు. మీ భర్త కి అంటరాని వ్యాధి (ఎ-యి-డ్స్) వ్యాధి ఉందనే విషయం మీకు తెలిసింది. అయితే మీరు అప్పుడు ఏం చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఎయిడ్స్ వ్యాధి ఉన్న మీ భర్తను వదిలేస్తారా లేక ఆయనతో కలిసి ఉంటు అవమానాలు ఎదుర్కొంటారా అన్న ప్రశ్నను సంధించారు. ఈ ప్రశ్న వినగానే ఆ అభ్యర్థికి కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అయితే కొద్దిసేపు తనని తాను తమాయించుకుని తర్వాత సమాధానం చెప్పడం మొదలుపెట్టింది.
ఈ ప్రశ్న వినగానే నాకు కంగారు వచ్చిన మాట వాస్తవమే కానీ నిజంగా నా భర్తకి అంటరాని వ్యాధి ఉన్నట్లయితే నేను ఆ వ్యాధి ఎన్నాళ్ళ నుండి ఉందో తెలుసుకుంటాను, వ్యాధి తీవ్రత గురించి తెలుసుకుని సిడి ఫోర్ కణాల సంఖ్య 200 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్న విషయాలను తెలుసుకుంటాను అని తెలిపింది. తర్వాత తాను కూడా హెచ్ఐ-వి పరీక్ష చేయించుకుంటానని అని సమాధానం చెప్పింది. పరీక్షలో తనకి నెగిటివ్ వస్తే ఇంట్లో ఒకరమైన ఆరోగ్యంగా ఉన్నాం అని సంతోషిస్తానని తెలిపింది.
Ads
ఒకవేళ తనకి పాజిటివ్ వస్తే చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి దాన్ని భరిస్తాను. ఒకవేళ నేను ఏ తప్పు చేయలేదని తప్పంతా నా భర్త మీద వెయ్యను. అది అతనికి ఎలా సోకింది అనే విషయాన్ని తెలుసుకుంటాను.నాకన్నా ముందే అతనికి వివాహేతర సంబంధం ఉందని తెలిసి దాని ద్వారా సంక్రమించిందని తెలిస్తే అతను తప్పు చేశాడు కాబట్టి అతన్ని క్షమించలేను అతని వల్ల మా జీవితాలు తలకిందులు అయ్యాయి కాబట్టి. ఒకవేళ అది వేరే విధంగా సంక్రమించింది నా భర్త తప్పు ఏమి లేదని తెలిస్తే మాత్రం ఇద్దరం కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవడం ప్రారంభిస్తాం. డాక్టర్లు సలహాలు తీసుకుని సరైన మెడిసిన్స్ తీసుకుంటూ ,వ్యాయామం చేస్తూ అన్ని పరీక్షలు చేయించుకుంటామని తెలిపింది.
ఇక నేను ఒక ఉన్నతమైన బాధ్యత నిర్వహిస్తున్నాను కాబట్టి నా పరిస్థితిని నాపై అధికారులకు నా సహచర ఉద్యోగులకు వివరంగా తెలుపుతాను. శరీరం సహకరించిన అంతవరకు ఉద్యోగం చేస్తాను, ఒకవేళ నా ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా చేయలేకపోతే నా అంతట నేను రాజీనామా చేసి వేరొకరికి అవకాశం కల్పిస్తాను అని తెలిపింది.నా భర్త నా పరిస్థితి దృష్ట్యా పిల్లలను వద్దనుకుంటాం.
ఇద్దరం కలిసి ఆరోగ్యం పై దృష్టి పెట్టి ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే ఎ-యి-డ్స్ వచ్చిన వారు కూడా సామాన్య ప్రజలతో కలిసి జీవించవచ్చు అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ సమాధానం చెప్పింది. ప్రియా సమాధానం విన్న ఇంటర్వ్యూ ప్యానల్ సభ్యులు లేచి చప్పట్లు కొట్టారు. వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రియా ని వెంటనే సెలెక్ట్ చేశారు.