Ads
అక్టోబర్ 5వ తారీఖు నుంచి జరగనున్న ప్రపంచ కప్ పోటీలకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఈ మ్యాచ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఐసీసీ.. వరల్డ్ కప్ ఇచ్చిన పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బ్యాటింగ్ కే కాకుండా.. బౌలింగ్ కి కూడా అనుకూలంగా ఉండే విధంగా పిచ్లను తయారు చేసే విధంగా క్యూరెటర్స్ కు సూచనలు ఇవ్వడం జరిగిందట.
ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్లలో ఎంతో తేలికగా బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేస్తున్న సందర్భాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచ కప్ పోటీలలో ఈసారి స్పిన్నర్లకు తమ ప్రతిభ కనబరిచే అవకాశం దొరుకుతుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ ,నవంబర్ నెలలో మంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి…ఆ సందర్భంలో జరిగే ఈ మ్యాచ్లలో స్పిన్నర్లు స్కోర్ విషయంలో కీలక పాత్ర పోషిస్తారని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.
Ads
అందుకే మ్యాచులు జరగబోయే మైదానంలోని పిచ్లపై గ్రాస్ ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని క్యూరెటర్స్ కు ఐసీసీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో మెయింటైన్ చేస్తున్న బౌండరీ దూరం 65 మీటర్లు కాగా ఇప్పుడు దాన్ని ఇంకొక ఐదు మీటర్లు పెంచి మొత్తానికి 70 మీటర్లు ఉండేలా చేయవలసిందిగా ఐసీసీ సూచనలు జారీ చేసింది. ఈ కొత్త మార్పులు జరగబోయే మ్యాచ్లలో బ్యాటర్లకు స్కోర్ చేయడానికి కాస్త ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.