Ads
వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు జోరుకు ప్రత్యర్థులు చిత్తు అవుతున్నారు. ముందుగా బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా విజయం టీమిండియాదే అవుతోంది. ఈ మెగాటోర్నీలో వరుసగా ఏడవ విజయం సాధించింది.
ప్రపంచకప్ లో సెమీఫైనల్ చేరిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది. భారత్ లీగ్ దశలో ఇంకో 2 మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. భారత్ తదుపరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడితే లాభం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ముంబైలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా శ్రీలంక పై 302 పరుగుల తేడాతో విజయం సాధించి, సెమీ ఫైనల్ కి చేరుకుంది. సెమీఫైనల్‌లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా భారత జట్టు ఘనత సాధించింది. లీగ్ స్టేజ్ లో మరో 2 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో టీమిండియా ఓడినా నష్టం లేదని తెలుస్తోంది. నవంబర్ 5న భారత్ నెక్స్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నెదర్లాండ్స్ తో నవంబర్ 12న ఆడనుంది.
ఈ నేపథ్యంలో భారత అభిమానులు సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ లో టీమిండియా ఓడితే లాభం అని చర్చించుకుంటున్నారు. ఓడిపోతే భారత్ కు ఎలా లాభం అని సందేహం వస్తుంది. దానికి ఓ కారణం ఉంది. 2011 లో భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరిగిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఇక ఆ ప్రపంచ కప్ లీగ్ దశలో టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవి చూసింది. ఆ తరువాత ప్రపంచ కప్ విన్నర్ గా నిలిచింది.
ప్రస్తుతం ప్రపంచకప్ కు భారత్ వేదికగా జరుగుతోంది. అందువల్ల ఇప్పుడు కూడా లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాతో చేతిలో ఓడితే, ఈసారి కూడా వరల్డ్ కప్ భారత్ దే అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇది కొందరికి వింతగా ఉన్నా, సెంటిమెంట్స్ ను ఫాలో అయ్యే ఫ్యాన్స్ మాత్రం టీమిండియా పై సౌతాఫ్రికా విజయం సాధించాలని కోరుకుంటున్నారు.
Ads
Also Read: వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ గెలిచిన తర్వాత భారత్ “డ్రెస్సింగ్ రూమ్”లో ఏం జరుగుతుందో తెలుసా..?