Ads
ప్రపంచ కప్ 2023లో భాగంగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓపెనర్ శుభమన్ గిల్ 66 బంతుల్లో 80 రన్స్ చేశాడు.
ఓపెనర్ గా బ్యాటింగ్ కి దిగిన శుభమన్ గిల్, మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా తప్పుకున్నాడు. గిల్ 79 పరుగుల చేసిన తరువాత కాలి కండరాలు పట్టేయడం వల్ల గిల్ బ్యాటింగ్ కొనసాగించలేక, రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ గా తప్పుకోమని రోహిత్ శర్మ చెప్పినట్టుగా తెలుస్తోంది.
మ్యాచ్ మధ్యలో శుభమన్ గిల్ కాలు కండరాలు పట్టేయడంతో రోహిత్ శర్మ అశ్విన్ కి చెప్పి, గిల్ ను మైదానం నుండి వచ్చేయమని సంకేతాలు ఇచ్చాడట. అయితే రోహిత్ అలా చేయడం వెనుక కారణం ఉందట. బ్యాటింగ్ కొనసాగించడానికి ఇబ్బందిపడుతున్న గిల్, బ్యాటింగ్ కొనసాగిస్తే అతనికి గాయం అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరిగితే గిల్ ఫైనల్ కు ఆడే ఛాన్స్ రిస్క్ లో పడుతుంది.
అంతే కాకుండా గిల్ కండరాలు పట్టేసిన సమయానికి భారత జట్టు మంచి స్థితిలో ఉండడంతో రోహిత్, ఫైనల్ మ్యాచ్ లో గిల్ ను ఆడించాలని, రిటైర్డ్ హర్ట్ గా తప్పుకోమని సూచించాడట. గిల్ వంటి మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడటం చాలా ముఖ్యం. అందువల్ల గిల్ సెంచరీ చేయడం కంటే టీమ్ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి కెప్టెన్ రోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు.
గిల్ వెనుతిరిగిన తరువాత అతని ప్లేస్ లో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ కి వచ్చాడు. ఈ మ్యాచ్ లో టీంఇండియా 50 ఓవర్లలో 397 పరుగులు చేసింది. కోహ్లీ , అయ్యర్ సెంచరీలు చేశారు. ఓపెనర్ గిల్ 80 పరుగులు, మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ 47 పరుగులు చేశారు. భారత్ కివీస్ ను 70 పరుగుల తేడాతో ఓడించి, ఫైనల్ కు చేరుకుంది.
Ads
Also Read: ఇదెక్కడి ట్విస్ట్..? ఇండియా గెలిచింది కోహ్లీ, శ్రేయాస్, షమీ వల్ల కాదా..? మరి ఎవరి వల్ల..?