Ads
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శశి వంగపల్లి గురించి చాలా మందికి తెలియదు. సమంత నుంచి తాప్సి వరకు ఆమె చాలా మంది సెలెబ్రెటీలకు ఫ్యాషన్ డిజైనింగ్ చేసారు. ఆమెది ఒక మధ్య తరగతి కుటుంబం. ఓ సాధారణ అమ్మాయిల బతకాలని ఆమె అనుకున్నారు. ఒక వ్యక్తిని వివాహం చేసుకుని సంతోషంగా జీవించాలని సాధారణ జీవితాన్ని కలలు కన్నారు. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం సంబంధాలు చూడడం కూడా స్టార్ట్ చేసారు. కానీ, ఎన్ని సంబంధాలు చూసిన వాటిల్లో ఆమె రిజెక్ట్ కాబడుతూ వచ్చేది.
ఒకసారి, రెండు, మూడు సార్లు కాదు 42 సార్లు అబ్బాయిలు ఆమెను రిజెక్ట్ చేసారు. ఓ సారి ఓ మ్యాచ్ వచ్చింది. ఆమె హోప్ వదిలేసుకున్నా, వారు ఒప్పుకోవడంతో ఆశపడింది. ఆ అబ్బాయి వాళ్ళు బాగా చదువుకుని, సంపాదిస్తున్నాడు. ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యి.. ఆమె సంతోషపడే సమయానికి సదరు పెళ్లి కొడుకు ఫ్యామిలీ మ్యారేజ్ రిజెక్ట్ చేసారు. కారణం ఏంటని అడిగితే.. ఆ పెళ్లి కొడుకు కాన్సర్ తో బాధపడుతున్నానని, నేను పెళ్లి చేసుకోలేనని చెప్పేసాడు. దీనితో శశి చాలా బాధ పడింది. అతను కోలుకోవాలని కోరుకుంది. కానీ, ఆ అబ్బాయికి తర్వాత వేరే అమ్మాయితో పెళ్లి అయ్యిందని తెలిసి ఆమె మనసు విరిగిపోయింది.
“నాకంటూ ఓ గుర్తింపు లేదు” కాబట్టే వాళ్ళు తిరస్కరిస్తున్నారు అని శశి భావించింది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ఏదైనా సాధించాలని డిసైడ్ అయ్యింది. ఫ్యాషన్ డిజైనర్ కావాలనే తన అభిరుచిని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంది. ఆమె ఇప్పుడు సెలబ్రిటీల కోసం డిజైన్ చేస్తోంది. ఆమె కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా మారింది, పేరు సంపాదించుకుంది మరియు తన కష్ట సుఖాలలో తోడుగా ఉన్న స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
“అప్పుడు నన్ను తిరస్కరించిన వారు ఇప్పుడు నా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు, ఇది నాకు డబ్బు కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది” అని చెప్తుంటే ఆమె మాటల్లో ఎంతో సంతోషం కనిపిస్తుంది. ఎంతైనా శశి గ్రేట్ కదా.. కృంగిపోకుండా జీవితంలో పైకి రావడానికి తనకి తాను సపోర్ట్ గా నిలిచింది.