Ads
ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ ముగిసింది. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ జరుగుతోంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుండే వేలానికి సిద్దమవుతున్నాయి.
ఐపీఎల్ కి విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే. ఈ లీగ్ లో ఏ ప్లేయర్ ఏ టీమ్ లో శాశ్వతంగా ఉండడు. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్లు మారుతుంటారు. చాలా మంది క్రికెటర్లు మారతారు. కొన్నిసార్లు జట్టు అంతా మారుతుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ టోర్నీలో రాణించిన ఆటగాళ్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఫ్రాంచైజీలు గత సీజన్ లో ప్లేయర్స్ ఆట తీరు, ఇప్పుడున్న ఫామ్ ను బట్టి తుది నిర్ణయానికి సిద్దమవుతున్నాయి. ఆటగాళ్లను రిటైన్ చేసుకోవటం లేదా వదిలించుకోవటం గురించి ఫైనల్ డిసిషన్ తీసుకొనే టైమ్ దగ్గరపడింది. ఐపీఎల్ జట్ల కూర్పులో ఊహించని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 కోసం మినీ ఆటగాళ్ల వేలం డిసెంబరు 19న దుబాయ్‌లో జరగనుంది. దీంతో ఏ ప్లేయర్ ను జట్టులో ఉంచుకోవాలి? ఎవరిని తొలగించాలి అనే విషయంలో జట్లు అన్ని బిజీగా ఉన్నాయి.
నవంబర్ 26 లోపు ఐపీఎల్ జట్లన్ని తమ ఆటగాళ్ల లిస్ట్ లను ఐపీఎల్ పాలకమండలి ముందు సమర్పించాలి. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి, రోహిత్ శర్మ గుజరాత్ జట్టులోకి వెళ్తాడనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానంలో పంత్ వస్తాడని, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ మారుతాడని టాక్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్ స్థానంలో మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
గత వేలంలో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక రేట్ పలికిన విదేశీ క్రికెటర్ గా సామ్ కర్రాన్ రికార్డ్ సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సామ్ కర్రాన్ నిరాశపరిచాడు. అందువల్ల పంజాబ్ ఈసారి అతడిని వదిలేయాలనుకుంటున్నట్లు టాక్. స్టోక్స్ వచ్చే ఏడాది ఐపీఎల్‌కు నుండి తప్పుకుంటానని ప్రకటించాడు. అందువల్ల సీఎస్కే అతన్ని రిలీజ్ చేయాలనుంది. సన్‌రైజర్స్ భారీ రేటుకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ నిరాశ పరిచాడు. కోల్‌కతా జట్టు నుంచి చాలా మంది ప్లేయర్స్ వేలానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
కేఆర్ జట్టు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లను వదిలేయాలని భావిస్తున్నటు సమాచారం. శార్దూల్ ఠాకూర్, ఫెర్గూసన్, సౌథీ, డేవిడ్ వీస్, షకీబ్, ఉమేశ్ యాదవ్, లిట్టన్ దాస్ వేలంలో ఉండనున్నారు. వేలంలో వరల్డ్ కప్ సాధించడంలో కీలకంగా మారిన ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ పై ఫ్రాంచైజీలు అన్ని ఫోకస్ చేసే అవకాశం ఉంది. గత డిసెంబరులో జరిగిన ఆక్షన్ లో హెడ్‌ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. కివీస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర కూడా వరల్డ్‌క్ కప్ లో ఆకట్టుకున్నాడు. అందువల్ల అతని పై కూడా దృష్టి పెడతారని తెలుస్తోంది. 8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ వేలానికి రాబోతున్నాడని తెలుస్తోంది.
Ads
Also Read: హేటర్స్ ట్రోల్ చేస్తారు కానీ…ఆయన గొప్పతనం చెప్పడానికి ఇదొక్కటి చాలు..! తప్పక చదవండి.!