Ads
సివిల్స్ ఎగ్జామ్స్ ఎంత కఠినంగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. అయితే మెయిన్స్ పాస్ అయ్యాక ఉండే ఇంటర్వ్యూ అంతకంటే కఠినంగా ఉంటుంది. ఇంటర్వూ క్రాక్ చేయాలంటే కేవలం పుస్తక జ్ఞానం సరిపోదు. సివిల్స్ ఇంటర్వ్యూలో నాలెడ్జితో పాటు పర్సనాలిటీ, సమయస్ఫూర్తి వంటి అంశాల గురించి కూడా క్వషన్స్ అడుగుతారు. అలాంటి సివిల్స్ ఇంటర్వ్యూకి హాజరు అయిన ఒక యువకుడిని ఇంగ్లీష్ రాదు అన్నారు. కానీ ఈ యువకుడు చెప్పిన జవాబుతో షాక్ అవడమే కాకుండా సెలెక్ట్ చేశారు. ఆ యువకుడు ఎవరో? ఏం సమాధానం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
Ads
ఐపీఎస్ ఫైనల్ వరకు వచ్చిన ఒక యువకుడికి ఇంటర్వ్యూలో సరిగా ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాడు. ఇంటర్వ్యూ చేసే అధికారి ఆ యువకుడిని, నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే ఐపీఎస్ అయిన తరువాత ఎలా మేనేజ్ చేస్తావని అడిగారు. అది విన్న తరువాత ఆ యువకుడు సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు ప్రశ్న అడిగిన అధికారి ఈ గ్లాస్ వాటర్ తాగి, జవాబు చెప్పమని అంటాడు. ఆ యువకుడు ఆ వాటర్ ను నేను తాగలేను సార్ అని అంటాడు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎందుకు అని అడుగుతాడు.
అప్పుడు ఆ యువకుడు, నేను స్టీల్ గ్లాస్ లో మాత్రమే వాటర్ తగుతాను. ఈ గ్లాస్ లో తాగను అని సమాధానం ఇస్తాడు. దాంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి కోపం వచ్చి, గ్లాస్ కి వాటర్ కి ఏం సంబంధం అని అడుగుతాడు. అదే సార్ నేను చెప్పేది, ఏ గ్లాస్ లో వాటర్ తాగుతున్నామనేది ముఖ్యం కాదు. వాటర్ మాత్రమే ముఖ్యం. అదే విధంగా అన్నిటినీ మేనేజ్ చేయడానికి నా టాలెంట్ మాత్రమే ముఖ్యం, నేను మాట్లాడే భాష కాదు అని చెప్తాడు. ఈ సమాధానంతో ఆ యువకుడిని సెలెక్ట్ చేశారు. ఆ ఐపీఎస్ ఆఫీసర్ పేరు మనోజ్ శర్మ. 2005 లో మహారాష్ట్ర కేడర్ నుంచి ఐపీఎస్ అయ్యాడు. ప్రస్తుతం ముంబైలోని వెస్ట్ రీజియన్ అడిషనల్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.