“గుప్పెడంత మనసు” సీరియల్ ని ఎండ్ చేసేస్తారా.? 1000 ఎపిసోడ్లు అవ్వగానే…అదే కారణమా.?

Ads

స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కధ కధనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటూ సక్సెస్ఫుల్ గా 987 ఎపిసోడ్ లని కంప్లీట్ చేసింది. అయితే చాలా రోజులుగా రిషి క్యారెక్టర్ కనిపించకపోవడంతో వెయ్యు ఎపిసోడ్ లో గుప్పెడంత మనసుకి శుభం కార్డు పడిపోతుంది అంటున్నారు ప్రేక్షకులు. నిజానికి సీరియల్ అంటేనే రిషి, జగతి, వసుధార.

ఈ ముగ్గురు క్యారెక్టర్ లో ఉన్నప్పుడు సీరియల్ ఒక రేంజ్ లో టాప్ టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే జగతి క్యారెక్టర్ చనిపోవడం ఇప్పుడు రిషి సీరియల్ లో కనిపించకపోవడంతో టిఆర్పి రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. అలాగే ఒకప్పుడు ప్రైమ్ టైం లో వచ్చిన ఈ సీరియల్ ని ప్రైమ్ టైం నుంచి తప్పించడం కూడా రేటింగ్స్ పడిపోవడానికి కారణమైంది. చాలామంది ప్రేక్షకులు రిషి, వసుధారల బంధాన్ని చూడటానికి ఇష్టపడేవారు.

Ads

ఇప్పుడు రిషి లేకపోవడంతో ఆడియన్స్ కి సీరియల్ రుచించడం లేదు. నిర్మాణ సంస్థతో గొడవలో లేదంటే ఇగో ఇష్యూస్ ఏమో తెలియదు కానీ సీరియల్ లో రిషి కనిపించకుండా పోవడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. పోనీ రిషి క్యారెక్టర్ లో వేరొక కొత్త యాక్టర్ ని పెడదాం అనుకున్నా. రిషి వసుధార ల ప్లేస్ లో వాళ్ళిద్దర్నీ తప్ప మరొకరిని ఊహించుకోలేము. అంత బలంగా ఆ పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నాటకపోయాయి.

guppedantha manasu jagathi

రిషి ఈరోజు వస్తాడు రేపు వస్తాడు అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఎదురుచూపులు మాత్రమే మిగులుతున్నాయి. రిషి ని చూపించకుండా కథని అక్కడికక్కడే తిప్పుతూ ఉండటంతో విసుగు పుట్టిన ప్రేక్షకులు అమ్మ బాబోయ్ అంటున్నారు. 987 ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకున్న ఈ సీరియల్ మరొక 13 ఎపిసోడ్లలో శుభం కార్డు వేసేసేలాగా ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక కొత్త పాత్రని సీరియల్ లోకి తీసుకురావడం ద్వారా నష్ట నివారణ చర్యలకు సిద్ధం అయ్యారు అనే విషయం కదనాన్ని బట్టి తెలుస్తుంది. మరి ఏం జరిగిందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Previous articleపెళ్లి తర్వాత ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి.? దాని వెనక అర్థమేంటి.?
Next articleసక్సెస్ స్టోరీ: కుమారి ఆంటీ ఒకప్పుడు ఆ స్టార్ సింగర్ ఇంట్లో వంటమనిషిగా చేసారని తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.