Ads
జాతీయ అవార్డుల ప్రధానోత్సవం నిన్న జరిగింది. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ జాతీయ అవార్డు గెలుచుకున్న సంగతి అందరికి తెలిసిందే. భార్య స్నేహతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యి అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ సారి తెలుగు సినిమాలకి కూడా చాలా అవార్డులు వచ్చాయి. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వించదగ్గ విషయం.
ఇది ఇలా ఉంటె…అసలు “పుష్ప” సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా చూసే ఇచ్చారా.? పుష్ప సినిమాలో హీరో పాత్ర ఒక రెగ్యులర్ సినిమాలో హీరో లాగా ఉండదు. అంటే పుష్ప అనే ఒక వ్యక్తి ఒక స్థాయికి చేరడం కోసం తప్పులు అయినా చేశాడు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా ఎర్ర చందనం రవాణా మీద ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుంది. అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ కాన్సెప్ట్ అయితే సమాజానికి వ్యతిరేకంగా ఉంటుంది.
Ads
“అసలు అలాంటి ఒక తప్పుడు సందేశం ఇచ్చిన సినిమాకి అవార్డు ఎలా ఇచ్చారు?” అంటూ కామెంట్స్ వచ్చాయి. “అంతే కాకుండా ఇది ఒక కమర్షియల్ సినిమా. అందులో హీరో ఒక కమర్షియల్ హీరో పాత్ర చేశాడు. మరో పక్క సూర్య నటించిన “జై భీం” సినిమా ఒక్క అవార్డు కూడా గెలవకపోవడం విచిత్రంగా ఉంది. సామాజిక రుగ్మతలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాల్ని నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనని స్పూర్తిగా తీసుకొని తెరకెక్కించిన ‘జై భీమ్’ కి అవార్డు ఎందుకు ఇవ్వలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వడం తప్పు కాదు.. కానీ జై భీమ్ లో లాయర్ గా నటించిన సూర్య కూడా అవార్డుకు అర్హుడే అంటూ సూర్య ఫాన్స్ అంటున్నారు. 2020లో సూరరై పోట్రు (ఆకాశమే హద్దురా) సినిమాకు సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సంగతి అందరికి తెలిసిందే. అవార్డు రాకపోయినా జై భీమ్ లాంటి మంచి సినిమా మాత్రం ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడు నిలిచిపోతుంది.