Ads
తెలుగు బుల్లితెర పై కామెడీ షో అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చే పేరు ‘జబర్దస్త్’. ఈ షో ద్వారా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకుని, పాపులర్ అయ్యారు. అలాంటివారిలో రాకింగ్ రాకేశ్ ఒకరు. సాధారణ కమెడియన్‌గా జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన రాకేశ్, తన టాలెంట్ తో టీమ్ లీడర్ ఎదిగారు. అలా రాకింగ్ రాకేశ్ పలు చిత్రాలలో అవకాశాలు పొందాడు.
Ads
రాకేశ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కేసీఆర్’. రీసెంట్ గా ఈ మూవీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తాజాగా రాకేశ్ ఈ సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టానని, కొందరు మోసం చేశారని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జబర్దస్త్ షోతో గుర్తింపు పొందిన స్టార్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ప్రస్తుతం ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) అనే మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీని మంత్రి మల్లారెడ్డి గ్రాండ్‌గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని బంజారాల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాకేశ్ నిర్మిస్తున్నారు.
బినామీ డబ్బులతో కేసీఆర్ మూవీ నిర్మిస్తున్నారనే వార్తలు రావడం పై స్పందించిన రాకింగ్ రాకేశ్ తాను ఎందుకు ప్రొడ్యూసర్ గా మారారో తెలిపారు. సినీ నటులకు అభిమానులు ఉన్నట్లుగా, తాను కేసీఆర్ కి ఫ్యాన్ అని, అందువల్లే కేసీఆర్ టైటిల్ తో మూవీ తీస్తున్నానని అన్నారు. బినామీ డబ్బుతో ఈ మూవీ నిర్మిస్తున్నానని వస్తున్న రూమర్స్ లో వాస్తవం లేదని, ఈ మూవీకోసం తన ఇంటిని తాకట్టు పెట్టినట్లుగా, ఆ పేపర్లు కూడా తన వద్ద ఉన్నాయని అన్నారు.
ఈ మూవీ తీస్తామని కొంతమంది మాట ఇచ్చారని, అయితే వాళ్ళు వెనక్కి వెళ్లడంతో తానే ఈ మూవీని నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. ఒక రచయిత మోసం చేయడంతో, ఈ మూవీ ప్రారంభం కాకముందే కారు అమ్ముకోవాల్సి వచ్చిందని, మూవీ నిర్మించే విషయంలో అమ్మ మరియు భార్య సుజాత తనని ప్రోత్సహిస్తున్నారని చెప్పుకొచ్చారు.
watch video :
Also Read: కేసీఆర్ పెళ్లి నాటి ఫోటో చూసారా..? ఎంత చిన్నగా ఉన్నారో చూడండి..?