Ads
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలతో సందడి చేసిన రజినీకాంత్ గత కొద్ది కాలంగా సరైన ఫలితాలు లేక తటపట ఇస్తున్నారు. అతనిపై భారీగా నమ్మకం పెట్టిన నిర్మాతలు కూడా నామమాత్రం లాభాలతో సరిపెట్టుకునేవారు. మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ కి జైలర్ సినిమా ఒక కం బ్యాక్ చిత్రంగా మారింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్లలో వరల్డ్ వైడ్ విడుదలయి అదరగొట్టే కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా కలెక్షన్ విషయానికి వస్తే.. 90 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ చిత్రం ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి బాక్సాఫీస్ వద్ద భాషా పవర్ చూపించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్షన్స్ లో కలిపి 600 కోట్ల గ్రాస్ సాధించగా..258.30 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. ఒక్క తెలుగులోనే 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంటే 30 కోట్ల రేంజ్ లో ఎన్నడూ లేని విధంగా భారీ లాభాలను తన ఖాతాలో వేసుకుంది.
Ads
పుష్కరకాలం తర్వాత రజనీకాంత్ జైలర్ మూవీ తో ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డ్లను వెతికి మరియు బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అత్యధిక ప్రాఫిట్ తెచ్చిపెట్టిన తెలుగు డబ్బింగ్ చిత్రంగా జైలర్ కొత్త రికార్డును సృష్టించింది. జైలర్ కి ముందు విడుదలైన రజిని చిత్రం పెద్దన్న తెలుగులో అతి పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు అంటే ఆ మూవీ ఏ రేంజ్ ఫ్లాప్ అయ్యిందో అర్థం అవుతుంది.
జైలర్ విషయానికి వచ్చేసరికి కరెక్టుగా రెండు రోజుల సమయానికి బ్రేక్ ఈవెన్ వసూలు రాబట్టడంతోపాటు మూడవ రోజు నుంచి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో సెప్టెంబ్ర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఓటిటి లో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.