Ads
తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ తేదీ సమీపించే కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇంకోవైపు బీజేపీ మరియు జనసేన పొత్తు కుదిరింది.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిన్న జరిగిన సభలో పీఎం నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మోదీ పవన్ పక్కపక్కనే కూర్చుని, ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. పవన్ మాట్లాడుతూ పీఎం మోదీని ఆకాశానికెత్తేశారు. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోదీ దేశ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు. ఎలెక్షన్స్ ప్రయోజనాల కోసం పనిచేయరని అన్నారు. భారతీయుల గుండెల్లో మోదీ ధైర్యం నింపారని మెచ్చుకున్నారు. మరోసారి కూడా మోదీ పీఎం కావాలని ఆశిస్తున్నట్లు పవన్ చెప్పారు. జనసేన పార్టీ పాలిటిక్స్ విభిన్నంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేనాని, తెలంగాణ ఎలెక్షన్స్ లో మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎలెక్షన్స్ కు వెళ్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. ఇక పొత్తులో భాగంగా జనసేన పార్టీకి బీజేపీ 8 సీట్లను కేటాయించింది. ఇప్పటికే 4 విడుతల్లో బీజేపీ వంద స్థానాల అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనసేనకు ఇచ్చిన ఎనిమిది సీట్లతో కలిపి, ఇప్పటి దాకా మొత్తం 108 స్థానాల అభ్యర్థులు ఖరారు చేసినట్లు అయ్యింది.
కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు వేరేలా ఉంది. అక్కడ జనసేన టీడీపీతో పొత్తును ప్రకటించింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు పార్టీలు కలిసే ప్రచారంలో పాల్గొంటున్నారు. కలిసే మేనిఫెస్టో ను రూపొందించెందుకు మీటింగ్ లు కూడా జరిగిన విషయం తెలిసిందే. కీలక బిల్లుల విషయంలో బీజేపీకి వైసీపీ మద్ధతు ప్రకటిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ ఎవరిని సపోర్ట్ చేస్తుంది. ఎవరిని టార్గెట్ చేస్తుందనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Ads
Also Read: తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే రిపోర్ట్…బీజేపీకి పెద్ద షాక్…అన్నే సీట్లు అంట.?