ఇదేం చీరకట్టు అంటూ “దేవర” హీరోయిన్ ను ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..!

Ads

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా మారింది.

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వి వరుస ఫోటో షుట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆ ఫోటోలు వెంటనే నెట్టింట్లో వైరల్ గా మారుతుంటాయి. అయితే జాన్వి తాజా ఫోటో షూట్ ట్రోల్ బారిన పడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జాన్వీ కపూర్‌ ‘ధడక్’ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆమె పలు హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. తొలిసారి సౌత్ ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ దేవర మూవీతో జాన్వీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ మత్స్యకారుని కుమార్తె గా నటుస్తున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ లంగా ఓణిలోనే చాలావరకు కనిపిస్తుందని సమాచారం. ఈ చిత్రం  ఏప్రిల్ 4న విడుదల కానుంది.
జాన్వీ కపూర్‌ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు ఫోటో షూట్లతో అభిమానులను అలరిస్తుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అందులో బోల్డ్‌ ఫోటోలు ఉంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వి కపూర్ ని ఇన్ స్టాగ్రామ్ లో 23 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు జాన్వీ కపూర్‌ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో జాన్వీ కపూర్‌ నలుపు రంగు చీరలో మెరిసింది. అయితే చీరకట్టు కాస్త డిఫరెంట్ గా ఉండడంతో నెటిజెన్లు ఇదేం చీరకట్టు జాన్వీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “దేవర” మూవీలో “శ్రీకాంత్” ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?

 

 

Previous articleఆటో డ్రైవర్లు సైడ్ కి కూర్చోవడం వెనకున్న కారణాలు ఏమిటో తెలుసా..?
Next articleసినిమా హీరో స్టైల్ లో వెళ్లి… కారులోనే పెళ్లి..! కానీ చివరికి సినిమాని మించిన ట్విస్టులు.! ఏమైందంటే.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.