Ads
2014 లో విడుదల అయిన జిగర్ తండ మూవీ కి సీక్వెల్ గా వచ్చిన సినిమా జిగర్ తండా డబుల్ ఎక్స్. ఇందులో ఎస్జే.సూర్య, రాఘవ లారెన్స్, నిమిషా సజయన్, సంచనా నటరాజన్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా తాజాగా నేడు అనగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
- మూవీ: జిగర్ తండా డబుల్ ఎక్స్
- నటీనటులు: ఎస్జే.సూర్య, రాఘవ లారెన్స్,నిమిషా సజయన్, సంచనా నటరాజన్, నవీన్ చంద్ర తదితరులు
- డైరెక్టర్: కార్తిక్ సుబ్బరాజు
- మ్యూజిక్: సంతోష్ నారాయణన్
- నిర్మాత: కార్తెకేయన్ సంతానం, ఎస్. కథిరిసన్
- రిలీజ్ తేది : నవంబర్ 10, 2023
కథ:
1975 సంవత్సరంలో ఒక థియేటర్ దగ్గర ఒక రౌడీ (లారెన్స్)కి జరిగిన గొడవ వల్ల తను హీరోగా మారాలని అనుకుంటాడు. కానీ ఆయన చూడడానికి చాలా నల్లగా అసహ్యంగా ఉంటాడు ఇక ఆరౌడీ హీరో అవుతాను అనడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. దాంతో వాళ్ళు అలా నవ్వడం చూసిన ఆ రౌడీ వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి అంటే తను హీరో అవ్వాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు.
తనను పెట్టి సినిమా తీసే డైరెక్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్ జె సూర్య అతనికి దొరుకుతాడు. సినిమా అంటే ప్యాషన్ గా ఉండే ఎస్ జె సూర్య ఒక బిగ్గెస్ట్ హిట్టు సినిమా తీసి తను ఒక పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు పొందాలి అనుకుంటాడు. కానీ అదే సమయంలో ఈ రౌడీతో సినిమా చేయమని ఎస్ జే సూర్య ఫోర్స్ చేస్తూ ఉంటారు.
Ads
మొదట్లో రౌడీతో సినిమా చేయడానికి అతను ఒప్పుకోడు. కానీ ఆ తర్వాత రౌడీతో సినిమా చేస్తే అది కొత్త రకమైన ఎక్స్పరిమెంట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఒప్పుకుంటాడు. ఇక అప్పటి నుంచి సూర్య లారెన్స్ ని పెట్టి సినిమా తీయడానికి ఎలాంటి కథను ఎంచుకోవాలి అనే కథాంశం మీదనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ రౌడీకి కొంతమంది రాజకీయ నాయకులతో ఏర్పడిన కలహాల వల్ల రౌడీ మంచి వ్యక్తిగా మారతాడా ఆయనతో సినిమాని తీసే ఎస్ జె సూర్య ఆ సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాడా లేదా అన్నది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఇప్పటివరకు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన తమిళ సినిమాలు అన్నీ కూడా మంచి మంచి విజయాలు సాధించాయి. అందులో 2014లో విడుదల అయిన జిగర్ తండ మూవీ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో స్టోరీ పెద్దగా లేనప్పటికీ స్క్రీన్ ప్లే గాని ఈ సినిమాని డైరెక్టర్ నడిపించిన విధానం చాలా బాగున్నాయి. ఈ సినిమాలో కొన్ని కొన్ని మైనర్ డీటెయిల్స్ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా డీల్ చేశాడు. అలాగే రౌడీ పాత్రలో లారెన్స్ ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎస్ జె సూర్య పాత్రలోని ఇంటెన్స్ ని ఎక్కడ తగ్గకుండా ఒక ప్యాషనేట్ డైరెక్టర్ ఎలాగైతే ఉంటాడో అలాగే ఈ సినిమాలో ఎస్ జే సూర్య కారెక్టర్ ని డిజైన్ చేశాడు. లారెన్స్ రౌడీ పాత్రలో ఒదిగిపోయి చాలా అద్భుతంగా నటించాడు.
ప్లస్ పాయింట్స్ :
- లారెన్స్, ఎస్ జె సూర్య యాక్టింగ్
- డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు రాసుకున్న పాయింట్స్, డెలివరీ చేసిన విధానం
- విజువల్స్.
మైనస్ పాయింట్స్ :
- కథలో డెప్త్ లేకపోవడం
- క్యారెక్టర్స్ రిపీటెడ్
- లాగ్ సీన్స్
- మ్యూజిక్.
రేటింగ్ : 2.75/5