యాత్ర-2 సినిమా కోసం… హీరో జీవా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Ads

కొన్ని సంవత్సరాల క్రితం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమాకి సీక్వెల్ అయిన యాత్ర-2 ఇప్పుడు విడుదల అవుతోంది. ఈ సినిమా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా రూపొందించారు.

ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు. స్వతహాగా తెలుగువారు అయిన జీవా, తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. రంగం వంటి సినిమాలు తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో జీవా నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో జీవా హీరోగా నటించారు.

jiiva remuneration for yatra 2 movie

ఇది జీవా మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. అంతకుముందు నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో జీవా నాగ చైతన్య అన్నయ్య పాత్రలో నటించారు. కానీ అది తెలుగు, తమిళ్ రెండు భాషల్లో రూపొందించిన సినిమా. ఇప్పుడు ఈ సినిమాతో డైరెక్టర్ తెలుగు సినిమాలో నటించారు. ఈ సినిమాకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా అని అర్థం అవుతోంది.

Ads

jiiva remuneration for yatra 2 movie

ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉంది. అయితే ఈ సినిమా కోసం జీవా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే ప్రశ్న నెలకొంది. ఈ సినిమా కోసం జీవా 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఇది జీవా కెరీర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా. ఈ సినిమాలో జీవా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర కోసం తనని తాను మార్చుకున్నారు.

jiiva remuneration for yatra 2 movie

వస్త్రధారణతో పాటు. మాట్లాడే విధానం, అలాగే కొన్ని చేతుల కదలికలు, వాకింగ్ స్టైల్ వంటివి కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే జీవా చేయడానికి ప్రయత్నించారు. మేకప్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే ఉండడంతో జీవా ఆ పాత్రకి చాలా బాగా సూట్ అయ్యారు అని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో కూడా మమ్ముట్టి కొంచెం సేపు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత కథ మొత్తం జగన్మోహన్ రెడ్డి పాత్ర పోషించిన జీవా కనిపిస్తారు.

ALSO READ : ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బౌద్ధ సన్యాసి..! ఎవరంటే..?

Previous article“దయచేసి ఇందులోకి నా తల్లిదండ్రులని లాగకండి..!” అంటూ… 90’s నటుడు “మౌళి” ఎందుకు రిక్వెస్ట్ చేశాడు..? ఆ వీడియోలో ఏం అన్నాడు..?
Next articleఉపాసన చెప్పిన బౌండరీస్ అంటే ఏంటి..? భార్యాభర్తలు ఇవి ఎందుకు ఫాలో అవ్వాలి..?