Ads
కష్టపడి పని చేసే వాళ్లకి గుర్తింపు, ఫలితం ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది అనటానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ కుమారి ఆంటీ. గత 13 సంవత్సరాలుగా ఆమె బిజినెస్ చేస్తున్నప్పటికీ ఆమె సడన్ గా సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు సీఎం గుర్తించే రేంజ్ కి వెళ్ళింది. అలాంటి ఆమె సక్సెస్ జర్నీ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కొంతమంది ఫుడ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు భోజనం మీద కంటెంట్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్ సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తిరుగుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా తిరుగుతూ ఫుడ్ టేస్ట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా వాళ్ల ద్వారా ఫేమస్ అయిన మహిళ కుమారి ఆంటీ. ఈమె అందరి దృష్టిలో పడిన తర్వాత అసలు ఈమె ఎవరు అనే ఎంక్వయిరీ ప్రారంభించారు నెటిజన్స్. అయితే కుమారి ఆంటీగా పాపులర్ అయిన దాసరి సాయికుమారి సొంత ఊరు గుడివాడ.
Ads
మెరుగైన జీవితం కోసం భర్తతో కలిసి కొన్నేళ్ల కిందట హైదరాబాదుకు వచ్చింది. తర్వాత ఆమె ప్రముఖ సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా చేసేది. పిల్లలు పెరుగుతుండడం, ఖర్చులు ఎక్కువ అవుతుండటంతో ఫుడ్ బిజినెస్ లోకి దిగాలని ఈ బిజినెస్ లోకి దిగింది సాయి కుమారి. ఈమె గత 13 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తుంది. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వల్ల తనకు పాపులారిటీ లభించింది.
కానీ అదే టైంలో నష్టం కూడా జరిగేలా అనిపిస్తోందని వాపోయింది కుమారి. ఎందుకంటే నిన్న పోలీసులు 50 వేల రూపాయలు ఫుడ్ అమ్ముకునే ఛాన్స్ లేకుండా సీజ్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆమెను కలుస్తానని చెప్పడం భోజనం కూడా రుచి చూస్తానని చెప్పడంతో వివాదానికి తెరపడినట్లుగా అయింది. ఏది ఏమైనాప్పటికీ ఒక వంట మనిషి స్థాయి నుంచి ముఖ్యమంత్రి గుర్తించే అంతటి స్థాయి కి ఎదగడం మామూలు విషయం కాదు. ఇది ఒక స్త్రీ మూర్తి విజయం.