Ads
దాదాపు 20 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉండి, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : సత్యభామ
- నటీనటులు : కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్.
- నిర్మాత : బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి
- దర్శకత్వం : సుమన్ చిక్కాల
- సంగీతం : శ్రీచరణ్ పాకాల
- విడుదల తేదీ : జూన్ 7, 2024
స్టోరీ :
సత్య అలియాస్ సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీంలో ఏసీపీ గా పనిచేస్తుంది. రైటర్ అయిన అమరేందర్ (నవీన్ చంద్ర) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఎలాంటి తప్పు చేసిన వారి నుండి అయినా సరే నిజాన్ని రాబట్టగల సత్తా ఉన్న సత్యభామ, వ్యక్తిగత జీవితానికంటే వృత్తికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఒక సమయంలో సత్యభామ హసీనా అనే అమ్మాయికి తన భర్త నుండి, అతను పెట్టే ఇబ్బందుల నుండి బయటకు రావడానికి సహాయం చేస్తుంది.
కానీ ఆ తర్వాత హసీనా చనిపోయినట్టు తెలుసుకుంటుంది. హసీనా చనిపోవడానికి హసీనా భర్త యాదు (అనిరుధ్ పవిత్రన్) కారణం అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత సత్యభామ ఏం చేసింది? యాదుని పట్టుకుందా? సత్యభామ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది? అసలు సత్యభామ ఈ కేస్ ని ఇంత వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఇలాంటి స్టోరీ ఉన్న సినిమాలు అంతకుముందు వచ్చాయి. కానీ ఇందులో కొంచెం డిఫరెంట్ గా తీశారు. విలన్ ఎవరు అని తెలియడానికి సినిమా అంతా కూడా సినిమాలో ఉన్న హీరో, హీరోయిన్ వెతుకుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో అలా కాదు. విలన్ ఎవరో అనేది ముందే తెలిసిపోతుంది. ఆ విలన్ ని పట్టుకోవడానికి సత్యభామ ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనే విషయాలు ఈ సినిమాలో చూపించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అందులోనూ ఇలాంటి జానర్ లో ఇంకా తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సినిమా ఒక మంచి ప్రయత్నం. సినిమా ఫస్ట్ హాఫ్ మామూలుగా మొదలవుతుంది. అసలు సత్యభామ ఎలాంటి పోలీస్ అనేది ఈ సినిమాలో చూపించారు.
Ads
కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్క పాత్ర పరిచయం అవ్వడం, వాళ్లకు వెనుక ఉన్న స్టోరీ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. తెలిసిన కథ. కానీ కొత్త టేకింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. డూప్ లేకుండా స్టంట్స్ చేశారు. ఇది చిన్న విషయం కాదు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు కాజల్. నవీన్ చంద్రతో ఉండే ఒక ఎమోషనల్ సీన్ లో చాలా బాగా నటించారు. సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు.
నవీన్ చంద్ర కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. సినిమాలో ప్రకాష్ రాజ్, నాగినీడు, అంకిత్ కొయ్య, హర్షవర్ధన్ ఇలా చాలా మంది నటీనటులు ఉన్నారు. వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్లే. వాళ్ల పాత్రకి ఎంత కావాలో వాళ్ళు అంత చేశారు. శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు బాగున్నాయి. కానీ, పాటలు కొన్ని చోట్ల అనవసరంగా పెట్టినట్టు అనిపిస్తాయి. సత్యభామ తాను అలా చేయడానికి కారణం ఏంటి అనేది చెప్తుంది. కానీ, అది ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు అనిపించదు. ఎడిటింగ్ బాగుంది.
టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. నిర్మాణ విలువల క్వాలిటీ కూడా తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ చాలా హై క్వాలిటీలో కనిపిస్తుంది. విష్ణు బేసి అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమా టోన్ ఎలివేట్ చేసేలాగా ఉంటుంది. తెలిసిన కథ అయినా కూడా, కొన్ని చోట్ల బోర్ అనిపించినా కూడా, కొన్ని చోట్ల మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ కనెక్ట్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- భారీ తారాగణం
- కాజల్ అగర్వాల్
- యాక్షన్ సీన్స్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- ఎమోషన్స్ లో బలం
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
కథ నుండి పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా, కాజల్ అగర్వాల్ ని కొత్త పాత్రలో చూడాలి అని అనుకునే వారికి, అసలు ఇలాంటి కాన్సెప్ట్ ని ఈ సినిమాలో ఎలా చూపించారు అని తెలుసుకోవాలి అని అనుకునే వారికి సత్యభామ ఒక్కసారి చూడగలిగే డీసెంట్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :