Ads
ఎన్టీరామారావుగారి నట వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణలు వచ్చారు. వారి తరువాత నందమూరి వంశం నుండి మూడోతరం వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వారి తరువాత మూడవ తరంలో మూడవ నట వారసుడిగా నందమూరి తారకరత్న ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
Ads
ఇంతవరకు ఏ హీరో చేయని విధంగా ఆయన ఒకేరోజు తొమ్మిది చిత్రాలు మొదలు పెట్టి, అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఆ రికార్డ్ ను సినీరంగంలో ఎవరు ఇంతవరకు బ్రేక్ చేయలేదు. అయితే ఆయన ఎందుకో హీరోగా విజయం పొందలేకపోయారు. దాంతో తారకరత్న ప్రతినాయకుడిగా పాత్రలు కూడా కొన్ని సినిమాలలో చేశారు. అలా ఆయన ప్రతినాయకుడిగా నటించిన ‘అమరావతి’ మూవీకి నంది అవార్డును అందుకున్నారు. ఇటీవల నందమూరి తారకరత్నకు హార్ట్ ఎటాక్ రావడంతో బెంగుళూరులో ఉన్న నారాయణ హృదయాలయ హాస్పటల్ జాయిన్ చేశారు. ప్రస్తుతం తారకరత్న చికిత్స పొందుతున్న విషయం అందరికి తెలిసిందే.
హాస్పిటల్‌లో బాబాయ్ అయిన బాలకృష్ణ అక్కడే ఉండి, కావలసిన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. బాలయ్యతో పాటు అక్కడ తారకరత్న భార్య, కూతురు ఉన్నారు. తారకరత్న రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని, తమ పార్టీ ప్రచారం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే ఆయనకు ఇలా అవడంతో అందరు షాక్ కి గురి అయ్యారు. ఇటు నందమూరి అభిమానులు, అటు పార్టీ వర్గాలు తారకరత్న త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. తారకరత్నను చూడడానికి నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దంపతులు, నందమూరి సుహాసిని, నందమూరి కుటుంబానికి ఆప్తుడు అయిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నారాయణ హృదయాలయకి వెళ్లారు. పలువురు టిడిపి నాయకులు హాస్పటల్ లో తారకరత్నను పరామర్శించి వచ్చారు. ప్రస్తుతం తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారని సమాచారం.ఇక తారకరత్న కోలుకోవడానికి బాలకృష్ణ, చంద్రబాబు మాత్రమే కాకుండా మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి కర్ణాటక హెల్త్ మినిస్టర్ కేశవ సుధాకర్. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయమని చంద్రబాబు నాయుడు కర్ణాటక ముఖ్యమంత్రిని కోరినప్పటి నుంచి సుధాకర్ ప్రతీ విషయం కూడా దగ్గరుండి మరి చూసుకున్నారు. అంతే కాకుండా దీని కోసం ఆయన అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.తారకరత్నను ఏపీ నుండి బెంగుళూరు తరలించినప్పటి నుండి ఆయన పర్సనల్‌గా తీసుకుని ప్రతిక్షణం డాక్టర్స్ తో మాట్లాడుతూ, ఏది కావాలంటే దానిని రెడీ చేయించారు. శివ రాజ్ కుమార్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లు వచ్చినపుడు కూడా వారితో పాటు హాస్పిటల్‌కి వెళ్లారు. అంతే కాకుండా వీరిని రిసీవ్ చేసుకోవడానికి హెల్త్ మినిస్టర్ సుధాకర్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లారు. తారకరత్న కోలుకోవడం కోసం శ్రమించిన హెల్త్ మినిస్టర్ సుధాకర్ ని, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ని, ఫ్యాన్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియచేస్తున్నారు. అభిమానులు హెల్త్ మినిస్టర్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు.
Also Read: ‘పుష్ప’ సినిమాలో సుకుమార్ చేసిన ఈ మిస్టేక్ ను గమనించారా?