ఆమె అందంగా లేదుగా.? హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారు అన్నందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

Ads

కార్తీక్ సుబ్బరాజు తాజాగా దర్శకత్వం వహించి సినిమా జిగర్తాండా డబుల్ ఎక్స్. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా మూవీ మేకర్స్ చెన్నైలో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కార్యక్రమానికి దర్శకుడు, హీరోలు కూడా పాల్గొన్నారు.

Ads

ఈ నేపథ్యంలోనే ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఒక తమిళ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజు దిమ్మతిరిగే విధంగా ఆన్సర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ రిపోర్టర్ ఏమి అడిగాడు? డైరెక్టర్ సమాధానం ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. సక్సెస్ మీట్ సందర్భంగా, రాఘవ లారెన్స్‌కి జోడీగా నిమిషా సజయన్‌ను ఎలా తీసుకున్నారని డైరెక్టర్‌ని ఒక రిపోర్టర్ అడిగాడు. తన తొలి తమిళ చిత్రం చితా తెలుగులో చిన్నాలో ఆమె అందంగా కనిపించనప్పటికీ ఆ నటి ఆకట్టుకునేలా నటించిందని, చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ.. నిమిషా ఎందుకు అందంగా లేదని విలేకరిని ఎదురు ప్రశ్నించారు. బహుశా మీ ఆలోచనా విధానం కావచ్చు. ఎవరైనా అందంగా లేరని మీరు చెప్పలేరు.

ఇది చాలా తప్పుడు ఆలోచన. ఇది దాదాపు బాడీ షేమింగ్ తో సమానం అంటూ కూడా కార్తీక్ రిపోర్టర్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఇక కార్తీక్ సుబ్బరాజ్ సమాధానం ఇచ్చిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. భలేగా బుద్ధి చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Previous articleఅప్పుడు గంగూలీ చేసిన తప్పే.. ఇప్పుడు రోహిత్ చేశాడా..?
Next articleహిట్ టాక్ వచ్చినా ఈ సినిమాపై “వరల్డ్ కప్” దెబ్బకొట్టిందిగా.? ఈ లెక్కలు ఒకసారి చూడండి.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.