కార్తీక దీపం సీరియల్ “హిమ” గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా..?

Ads

కార్తీకదీపం.. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక వ్యూస్ తో రికార్డులు కొల్లగొట్టిన ధారావాహిక. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ సీరియల్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. సీరియల్ ప్రసారం అయినంత కాలం వంటలక్క డాక్టర్ బాబు అనే పేర్లు బాగా ఫేమస్ అయిపోయాయి.

ఎక్కడ చూసినా కూడా ఇదే సీరియల్ గురించే ప్రస్తావించుకునేవారు. ఇక ఈ సీరియల్ లో నటించిన నటీనటులకు బాగా గుర్తింపు దక్కింది. కార్తీకదీపం సీరియల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత, సౌందర్య, హిమ, సౌర్య. కాగా ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా హిమ పాత్రలో నటించిన అమ్మాయి గురించి మనందరికీ తెలిసిందే.

karthika deepam hima

ఇందులో నటించిన హిమ ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో మారింది. హిమ అసలు పేరు బేబీ సహృద. అమె సీరియల్ లైఫ్ లోనే కాదు. రియల్ లైఫ్ లోనూ ఎన్నో విషాదాలను చూసింది. ఒక తన పర్సనల్ విషయాలను చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తను పుట్టినప్పుడు వాళ్ల నాన్న చూడడానికి రాలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. అయితే ఈ సీరియల్ తర్వాత సీరియల్ ప్రసారమవుతున్న సమయంలో ఎన్నో షోలకు ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది.

karthika deepam hima

ముఖ్యంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది సహృద. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. అయితే కార్తీక దీపం సీరియల్ పూర్తయిన తరువాత బేబీ సహృద చదువుపై దృష్టి పెట్టింది.

karthika deepam hima

అయితే సీరియల్స్ లో ఎక్కువగా నటించకపోయినా ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల ఆమె అందమైన ఫొటోలను అప్లోడ్ చేసింది. ఇందులో హిమ హీరోయిన్ రేంజ్ లో కనిపిస్తోంది. సీరియల్ లో ఎంతో సింపుల్ గా కనిపించే హిమ బయట మాత్రం బీచ్ లో వెకేషన్ లు తిరుగుతూ ఈ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

Previous article“గెలిచే మ్యాచ్ లో ఈ ప్లేయర్ కారణంగానే ఓడిపోయాం..!” అంటూ… “సూర్యకుమార్ యాదవ్” కామెంట్స్..! ఎవరంటే..?
Next articleప్రతి దానికి “చిరంజీవి” ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? కేవలం చిరంజీవి విషయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.