Ads
నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల యావత్ దేశం గర్విస్తోంది. తెలుగు సినిమా కలగా ఉన్న ఆస్కార్ ను జక్కన్న నిజం చేశాడు. అయితే ఆస్కార్ రావడం జక్కన్న ప్లానింగ్ మరియు స్ట్రాటజీకి వల్లే సాధ్యం అయ్యిందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే.
Ads
అయితే దీని వెనక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ కార్తికేయ అని, అతని వల్లే ఆస్కార్ వచ్చిందని సమాచారం. ఆస్కార్ అందుకున్న తరువాత స్టేజ్ మీద కీరవాణి కార్తికేయకి థాంక్స్ కూడా చెప్పాడు. ఇదే విషయన్ని బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరి ఆస్కార్ రావడానికి కార్తికేయ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
ఇక నాటు నాటు సాంగ్ కి గాను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ అందుకున్నారు. అయితే వాస్తవానికి ఈ పాట సక్సెస్ లో ఎంతో మంది పాత్ర ఉంది. ఈ పాటకు నృత్యరీతులు అందించిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, తమ స్టెప్పులతో ఆకట్టుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్. అందరి కన్నా దర్శకుడిగా ఈ సాంగ్ ను ఆకట్టుకునేలా తెరకెక్కించిన రాజమౌళి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి ఈ అవార్డు దక్కుతుంది. ఈ సాంగ్ సమష్టి కృషి అని జక్కన్న మొదటి నుంచి చెప్తున్నాడు. ఐతే వీరంతా కనిపించే వాళ్లు. కానీ ఈ పాటకు ఆస్కార్ రావడం వెనుక కనిపించని హీరో వేరొకరు ఉన్నారు. ఆయనే కార్తికేయ. ఎస్ ఎస్ రాజమౌళి, రమల కుమారుడు.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్. ఈ పాట రూపకల్పన చేసిన బృందంలో ఆయన ఒకరు. ఈ పాట షూటింగ్ మరియు తదితర విషయాలను కార్తికేయ దగ్గరుండి చూసుకున్నాడు. ఇక ఈ మూవీకి నెట్ఫ్లిక్స్లో అప్లాజ్ వచ్చిన దగ్గర నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రచారం చేయడంలో కార్తీకేయదే ముఖ్య పాత్ర. ఈ మూవీని అస్కార్ అప్రూవ్డ్ థియేటర్లలో ప్రదర్శించేలా చేసింది కార్తీకేయనే. టీసీఎల్ లాంటి థియేటర్లలో ఈ మూవీ ప్రదర్శించటంతో భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఇంకో వైపు ‘వెరైటీ’ వంటి ప్రముఖ మ్యాగజైన్ లో ఈ మూవీ గురించి ఆర్టికల్స్ వచ్చేలా చేశాడు. అమెరికాలోని థియేటర్లలో ఈ మూవీ హీరోలు ఎన్టీఆర్, చరణ్ లను తిప్పుతూ ఆడియెన్స్ కి పరిచయం చేశాడు. కార్తికేయ వారితో అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేలా ప్లాన్ చేసాడు. జపాన్లో మూవీ భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేసి, ఇంటర్నేషనల్ స్థాయిలో మరింత ప్రచారం దక్కేలా చేశాడు. ఇలా ఆస్కార్ రావడం వెనుక కార్తికేయ ప్రమోషనల్ స్ట్రాటజీ. ఇక ఇదే విషయన్ని ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ నువ్ సాధించావ్ అని కార్తికేయ ఫోటోను షేర్ చేశాడు.
Also Read: బాహుబలి మూవీలో తమన్నా క్యారెక్టర్ చేజార్చుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
A very special shoutout too @ssk1122 who from behind the scenes quitely lead an amazing campaign to be here today ! Great job Karth! A big big congratulations !! You did it!! 🤩🤩👏👏 pic.twitter.com/A08zB4tLPY
— Shobu Yarlagadda (@Shobu_) March 13, 2023