3 గంటలు థియేటర్ లో ఈ సినిమా ఎలా చూడగలిగారు? అంటూ…”యానిమల్” పై కామెంట్స్ చేసిన గృహలక్ష్మీ కస్తూరి..!

Ads

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి అదే స్థాయిలో ఆడియెన్స్ నుండి రెస్పాన్స్‌ రావడంతో భారీ వసూళ్లను సాధించింది.

తాజాగా 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో సైతం పలు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో కూడా దూసుకెళ్తూ, ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ తరువాత విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఈ మూవీ చూసిన సీనియర్ నటి కస్తూరి మండిపడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం యానిమల్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ కి ఆడియెన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి, దాదాపు 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి విమర్శలు వచ్చాయి.
comments on these scenes in animalఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసి కొందరు బాగుందని అంటే, కొందరు ఇదేం మూవీ అంటూ తల పట్టుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ ఆడియెన్స్ ఈ మూవీ పై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ నటీమణులు రాధిక, కస్తూరీ లాంటి వారు యానిమల్ మూవీ పై విమర్శలు చేస్తున్నారు. నటి రాధిక యానిమల్ పేరు మెన్షన్ చేయకుండా, చెత్త మూవీ, కోపం వచ్చిందని ఫైర్ అయ్యింది. తాజాగా గృహలక్ష్మీ ఫేమ్ కస్తూరీ యానిమల్ మూవీ పేరు చెప్పి మారి తిట్టేసింది.
“నిన్న రాత్రి ఈ సినిమా చూడటం మొదలుపెట్టాను. సగం కూడా అయిపోలేదు. అప్పటికే విసుగొచ్చింది. అసలు ఈ మూవీని ఎలా చూశారు?మూడున్నర గంటలు ప్రజలు సినిమా హాళ్లలో ఎలా కూర్చున్నారు? ఆటో ఫ్లైయింగ్ ప్లేన్‌లో ఆ సన్నివేశాలు ఏమిటి? ప్రేమలో పడటం, మాట్లాడుకునే సమయంలోనే అలా జరగడం ఏంటి? నన్ను తప్పుగా భావించవద్దు, ఇది ఒక ఫిల్మ్ మేకర్ టాప్ నాచ్‌లో తెరకెక్కించాడు. కానీ ఆ రేంజ్ ని అందుకోలేం. మూవీలో చాలా ఉంది. కానీ ఆ మూవీ ఎంటర్టైన్ చేయకుండా, విసుగును తెప్పించింది” అని సామాజిక వేదిక ఎక్స్ లో రాసుకొచ్చారు.

Ads

Also Read: ప్రభాస్ “సలార్” సినిమాలో చూపించిన “కాటేరమ్మ” దేవత కథ తెలుసా..?

Previous articleనేషనల్ అవార్డు విన్నర్… కానీ వరకట్నం కోసం వేధించాడా..? ఇతను ఎవరో తెలుసా..?
Next articleఅతడు మూవీలో ఆ సన్నివేశాన్ని ఆ నవల నుండి కాపీ చేశారని తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.