Ads
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టు సంచలనం సృష్టించింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో తొలి రెండు మ్యాచుల్లో శ్రీలంక లాంటి అగ్ర జట్లను ఓడించిన సౌతాఫ్రికా పై రెండు మ్యాచుల్లో దారుణంగా ఓటమి పాలైన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది.
సౌతాఫ్రికా నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ అనగానే అందరూ సౌతాఫ్రికా అలవోకగా విజయం సాధిస్తుందని భావించారు. కానీ చిన్న జట్టు అయిన నెదర్లాండ్స్ అద్భుతమైన ఆటతీరుతో బలమైన సౌతాఫ్రికా జట్టుని ఓడించి, ఊహించని విధంగా ప్రపంచ కప్‌లో బోణీ కొట్టింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 17) నాడు దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించడంతో 43 ఓవర్లకే మ్యాచ్ ను కుదించారు. అందరూ భావించినట్లే మ్యాచ్‌లో తొలుత సౌతాఫ్రికానే పైచేయి సాధించినట్టు కనిపించింది. ముందుగా బ్యాటింగ్‌కు చేసిన డచ్ జట్టు 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడింది. ఆ తరువాత నెదర్లాండ్స్ ప్లేయర్స్ గేర్ మార్చారు. ఫోర్లు, సిక్స్‌లతో సౌతాఫ్రికా బౌలర్ల పై విరుచుకుపడ్డారు.
ఆ తరువాత 246 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 42.5 ఓవర్లలో 207 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 38 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పై సంచలన విజయం సాధించింది. దీంతో ప్రపంచ కప్ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నెదర్లాండ్స్ నమోదు చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికా లాంటి బలమైన జట్టు, టెస్ట్ అర్హత కూడా సాధించని నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలయ్యింది.
Ads
అయితే ఐసీసీ టోర్నీలో సౌతాఫ్రికా జట్టుకు నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పొందడం కొత్తేమీ కాదు. 2022 లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ సౌతాఫ్రికా పై విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ సౌతాఫ్రికాను ఓడించింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో నెటిజెన్లు, టోర్నీలో టాప్ 3 లో ఉన్న సౌతాఫ్రికా టేబుల్ లో లాస్ట్ లో ఉన్న నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
Meet South Africa cricketer keshav maharaj.
The bat that Keshav uses has the sacred word Om 🕉️ written on it.
Even though Keshav settled in South Africa, his deep faith in Sanatan tradition and Hindu religion.
hat's off#Netherlands#SAvsNED pic.twitter.com/VIcJnxxZcx
— Dhruv Tripathi (@Dhruv_tr108) October 17, 2023
ఇది ఇలా ఉంటె…ఈ మ్యాచ్ లో ఓ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ బాట్ పై ఓం అని ఉంది. అతనే కేశవ్ మహరాజ్. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అందరి దృష్టి ఈ స్టికర్ పైనే. అంతే కాదు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా పదే పదే ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ కనిపించరు. ఒక సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉంది కదా.? అతని పూర్తి పేరు కేశవ్ ఆత్మానంద్ మహరాజ్. అతని పూర్వికులు భారత్ కి చెందిన వారే. 1990 ఫిబ్రవరి 7వ తేదీన డర్బన్‌లోని నాటల్‌లో జన్మించాడు కేశవ్. అతని పూర్వికులు దక్షిణాఫ్రికాలో స్థిరపడినప్పటికీ హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. అందుకే కేశవ్ మూలాలు మర్చిపోకుండా అలా చేసాడు.
Also Read: టీం ఇండియాకి వరల్డ్ కప్ లో ఇప్పుడే అసలైన ముప్పు ఉందా.? న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో కాదండోయ్.!