Ads
ఐసీసీ ప్రపంచకప్2023 టోర్నీ గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబర్ 19న జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా, ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. బీసీసీఐ ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
తాజాగా ఐసీసీ ఈ హైవోల్టేజ్ మ్యాచ్ లో పాల్గొనే అంపైర్‌ల లిస్ట్ ను ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన అంపైర్ల లిస్ట్ చూసిన భారతీయ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఆ లిస్ట్ లో ఇండియన్ ఫ్యాన్స్ ఐరెన్ లెగ్ అని పిలుచుకునే అంపైర్ కూడా ఉన్నారు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ ప్రకటించిన అంపైర్ల లిస్ట్ లో రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ లను ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా, జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్‌గా, యాండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించనున్నారు. భారత ఫ్యాన్స్ ఐరెన్ లెగ్‌గా పిలిచే అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కూడా ఈ లిస్ట్ లో ఉండటంతో ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే రిచర్డ్ కెటిల్‌బరో వల్ల చాలా ఐసీసీ టోర్నిలలో నాకౌట్ మ్యాచ్‌లలో భారత జట్టు ఓటమి పాలయ్యిందని భారత క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందువల్ల అతన్ని ఐరెన్ లెగ్‌గా పిలుస్తారు.
2014 నుండి గత 9 ఏళ్ల కాలంలో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్ గా ఉన్న నాకౌట్ మ్యాచ్‌లలో భారత జట్టు గెలుపు సాధించలేదు. టీ20 ప్రపంచకప్ 2014 ఫైనల్ లో భారత్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌కు కూడా కెటిల్ బరోనే అంపైర్. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో కెటిల్ బరో అంపైర్, ఆ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఆ తరువాత టీ20 ప్రపంచకప్ 2016, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2017, వన్డే ప్రపంచకప్ 2019 సెమీఫైనల్ లోనూ కూడా భారత జట్టు ఓటమి పాలవ్వగా, కెటిల్‌బరోనే ఆ మ్యాచ్‌లకు కూడా అంపైర్ గా ఉన్నారు.
భారత జట్టు ఓడిపోయిన టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021, 23 ఫైనల్స్ కి కూడా కెటిల్‌బరోనే థర్డ్ అంపైర్‌గా ఉన్నారు. రిచర్డ్ కెటిల్ బరో మ్యాచ్ లో తీసుకునే డిసిషన్స్ ఎక్కువ శాతం భారత్ కు ప్రతికూలంగానే వచ్చేవి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ కి అంపైర్‌గా రిచర్డ్ కెటిల్ బరోను ప్రకటించేసరికి భారత అభిమానులు ఈ ఐరెన్ లెగ్ అంపైర్ మళ్లీ వచ్చాడా అని ఆందోళన పడుతున్నారు.
Ads