కిక్ సినిమాలో ఇలియానా చెల్లెలు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో చూడండి.!

Ads

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొంతమంది స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఇండస్ట్రీలో కొంతకాలం పాటు కొనసాగుతూ ఉంటారు. మరికొందరి మాత్రం నటించిన సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి కనుమరుగవుతూ ఉంటారు. ఇక చాలామంది హీరోయిన్లకు చెల్లెలు పాత్రలలో నటిస్తూ తదుపరి సినిమాలలో హీరోయిన్లుగా కూడా అవకాశం పొంది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాలో హీరోయిన్ గా  ఇలియానా నటించిన ఆమె చెల్లెలి పాత్రలో ఆషికా బతిజ నటించిన సంగతి తెలిసిందే.

Ads

ఒక సినిమాలో హీరోయిన్ కి చెల్లెలు పాత్ర అంటే ఆమె కూడా హీరోయిన్ రేంజ్ లోనే అందంగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. కిక్ సినిమాలో రవితేజ ఆషికా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తు ఉంటాయని చెప్పాలి. ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ద్వారా ఆషికా సైతం ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినప్పటికీ ఈమె మాత్రం పెద్దగా ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయారు.

కిక్ సినిమా తర్వాత ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె తదుపరి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఈమెకు అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలు రాకపోవడంతో చేసేదేమీ లేక ఇండస్ట్రీకి దూరమై ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిపోయారు. ఇలా ఉన్నత చదువులు చదివినటువంటి ఆషికా ప్రస్తుతం మోడలింగ్ రంగంలో స్థిరపడ్డారని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేయగా అవి మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే హీరోయిన్ మెటీరియల్ అయినటువంటి ఈమెకు సినిమా అవకాశాలు రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Previous articleగంగూలీ చేసిన ఈ తప్పు వల్లే 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయామా..? ఇప్పుడు రోహిత్ అలా చేయకపోతే గెలుపు మనదే..!
Next article2014 నుండి వరల్డ్ కప్ లో 5 సార్లు టీమ్ ఇండియాని వెంటాడిన దరిద్రం ఇతనే.. ఇప్పుడు 2023 ఫైనల్ లో కూడా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.