Ads
షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన నటీనటులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు కిరణ్ అబ్బవరం. ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, ఆ తర్వాత ఫీచర్ ఫిలిమ్స్ లోకి తన దారిని మార్చుకున్నారు. 2015 నుండి కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మొదలు పెట్టారు.
గచ్చిబౌలి అనే షార్ట్ ఫిలిం తో తన నటన కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత దాదాపు 11 షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. 2019 లో రాజావారు రాణి గారు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాగా పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెబాస్టియన్ పిసి 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాల్లో నటించారు. ఇందులో ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు హిట్ టాక్ సంపాదించుకున్నాయి. మిగిలిన సినిమాల్లో కొన్ని సినిమాలకి కాన్సెప్ట్ బాగున్నా కూడా టేకింగ్ పరంగా పొరపాట్లు జరగడంతో ఆశించిన ఫలితాలు పొందలేదు.
Ads
కిరణ్ అబ్బవరం సినిమాల్లో ఇప్పటి వరకు హిట్ సినిమాలతో పోలిస్తే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే వరుస పెట్టి కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే కిరణ్ అబ్బవరం పారితోషకం విషయంలో కూడా ఒక కొత్త టెక్నిక్ పాటిస్తారు. అదేంటంటే, సినిమాలు రిలీజ్ అయినప్పుడు కిరణ్ అబ్బవరం పారితోషకం తీసుకోరు. సినిమా విడుదల అయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటారు. సాధారణంగా యంగ్ హీరో ఇలాంటి సాహసాలు చేయరు. చాలా పెద్ద స్టార్ హీరోలు అయితే మాత్రమే ఇలా ఆలోచిస్తారు. కానీ కిరణ్ అబ్బవరం మొదటి నుండి కూడా ఇలాగే చేస్తున్నారు.
తన సినిమాల్లో మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు తనకే నచ్చలేదు అని ఒక సందర్భంలో కిరణ్ అబ్బవరం చెప్పారు. మీటర్ సినిమా చాలా అవుట్ డేటెడ్ సినిమా అని, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా అంత పెద్దగా కావాల్సిన సినిమా కాదు అని సరదాగా చెప్పారు. అయితే, కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రుబా అనే ఒక సినిమాలో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా సరదాగా తీసుకోని తన పని తాను చేసుకుంటూ వెళ్తారు.
ALSO READ : సినిమా పాటలనే కాదు… సీన్స్ ని కూడా వదలట్లేదుగా..? అసలు సీరియల్ లో ఇలాంటి సీన్ ఎందుకు పెట్టారు..?