Ads
‘మత్తు వదలరా’ మూవీ ఫేమ్ నరేష్ అగస్త్య హీరో నటించిన లేటస్ట్ మూవీ కిస్మత్. అభినవ్ గోమఠం కూడా నటించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- వెబ్ సిరీస్: కిస్మత్.
- నటీనటులు: నరేష్ అగస్త్య,రియా సుమన్, అభినవ్ గోమఠం,అవసరాల శ్రీనివాస్, విశ్వదేవ్ రాచకొండ, తదితరుల
- దర్శకుడు: శ్రీనాథ్ బాదినేని
- సంగీతం: మార్క్ కె రాబిన్
- నిర్మాత : రాజు
- రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 3, 2024
కథ:
మంచిర్యాలలో ఉండే కార్తీక్ (నరేష్ అగస్త్య),కిరణ్ (విశ్వదేవ్ రాచకొండ), అభి (అభినవ్ గోమఠం), ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురు బీటెక్ చేసిన ఎవరికి జాబ్ రాలేదు. దాంతో వీళ్ళ తల్లిదండ్రులతో తిట్లు తింటూ ఉంటారు. ఈ క్రమంలో వారి చుట్టుపక్కల ఉండే వారు హేళన చేస్తుంటారు. దాంతో జాబ్ కోసం సొంత ఊరును వదిలి హైదరాబాద్ కి వస్తారు.
సిటీలో ఒక పెంట్ హౌస్ ను అద్దెకి తీసుకుంటారు. జనార్ధన్ (అజయ్ ఘోష్) అనే పొలిటికల్ లీడర్ ఇరవై కోట్ల రూపాయలను పోగొట్టుకుంటాడు. ఆ డబ్బు కాస్త కార్తీక్, కిరణ్, అభి లకు దొరుకుతుంది. కానీ ఆ డబ్బు వల్ల ఆ ముగ్గురికి చాలా సమస్యలు ఎదురవుతాయి. జనార్ధన్ ఆ డబ్బు కోసం వెతుకుతూ ఉంటాడు? వివేక్ (శ్రీనివాస్ అవసరాల) ఎవరు? తరువాత ఏం జరిగింది? చివరికి ఆ డబ్బు ఎవరికి దక్కింది? అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ:
Ads
క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన కిస్మత్ తో దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. కానీ తన టేకింగ్ తో మూవీని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ప్రధమార్ధం పర్వాలేదు. కానీ సెకండ్ సెకండ్ హాఫ్ స్టోరీ అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది.
నరేష్ అగస్త్య ఎప్పటిలానే డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, తన మార్క్ డైలాగ్స్ తో అలరించాడు. విశ్వ దేవ్ ఓకే అనిపిస్తాడు. ఇక హీరోయిన్ గా రియా సుమన్ పర్వాలేదనిపించింది. అజయ్ ఘోష్,’టెంపర్’ వంశీ పర్వాలేదు. కీలక పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ అక్కడక్కడా నవ్వించాడు. మిగిలిన వారు తమ పాత్రల మేరకు బాగానే చేశారు.
ప్లస్ పాయింట్స్:
- నరేష్ అగస్త్య నటన,
- అభినవ్ గోమఠం కామెడీ,
- వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్,
- పేలవమైన స్క్రీన్‌ప్లే
రేటింగ్: 2/5
ఫైనల్ గా:
అక్కడక్కడా నవ్వించే రొటీన్ క్రైమ్ కామెడీ సినిమా ‘కిస్మత్’. ఎలాంటి అంచనాలు లేకుండా టైం పాస్ కి చూడవచ్చు.
watch trailer :
Also Read: Miss Perfect Review: హీరోయిన్ “లావణ్య త్రిపాఠి”నటించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే..?