“నిజం గెలవడం వల్లే చంద్రబాబు జైల్లో ఉన్నారు..! అంటూ… “నారా భువనేశ్వరి” యాత్రపై కొడాలి నాని కామెంట్స్..!

Ads

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి, నెల రోజులు దాటినా కూడా ఇప్పటివరకు రాజమండ్రి జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే పేరుతో బస్సుయాత్రను మొదలుపెట్టారు.

బుధవారం నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు అయిన విషయాన్ని విని మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అయితే ‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర పై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రజలకు నిజాలను చెప్పాలనే ఉద్దేశ్యంతో నారా భువనేశ్వరి బస్సు యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యాత్ర తిరుపతి జిల్లాలో  కొనసాగుతోంది. అయితే భువనేశ్వరి బస్సు యాత్ర పై మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా కామెంట్లు చేశారు. నిజం గెలిచింది అందువల్లే చంద్రబాబు జైలులో ఉన్నారని అన్నారు. భువనేశ్వరి నిజం గెలవాలని కోరుకుంటే చంద్రబాబు లైఫ్ లో బయటకురారు అని అన్నారు.
చంద్రబాబు ఫ్యామిలీ అంతా అవినీతి డబ్బులో మునిగిపోయిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ కండిషన్ లో ఉన్నారు. నారా భువనేశ్వరి ఏ స్థాయిలో ఉందని ప్రశ్నించారు. 2 ఎకరాలతో మొదలైన చంద్రబాబు ప్రస్థానం ఈరోజు రెండు వేల కోట్లు దాటిందని తెలిపారు. 40 రోజుల్లో ఢిల్లీ న్యాయవాదులకు ముప్పై ఐదు కోట్లు ఎలా  ఫీజులుగా ఇచ్చారని ప్రశ్నించారు. కష్టించి పొలం దున్నితే వచ్చిన సొమ్ముతో బస్సుయాత్ర చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై కొడాలి నాని మరోసారి విమర్శలు చేశారు. 2019 ఎలెక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ తెర వెనుక తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారని అన్నారు. అయితే ఇప్పుడు ఆ ముసుగు తొలపోయిందని, చంద్రబాబు నాయుడు కోసమే పవన్ జనసున్నా పార్టీ స్థాపించారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ సమర్ధుడైతే ఇంట్లో ఉండే మహిళలు రోడ్ల మీదకు ఎందుకు వస్తారని అడిగారు. లోకేష్ ఢిల్లీకి  పారిపోయి తన తల్లిని రోడ్ల మీద తిప్పుతున్నారని, లోకేష్ పప్పు అనే విషయం ఇంకోసారి రుజువైందని ఎద్దేవా చేశారు.

Ads

Also Read: “ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం..!” అని చెప్పిన మంత్రి కేటీఆర్..! ఏం అన్నారంటే..? 

Previous articleరాజేంద్రప్రసాద్, గౌతమి నటించిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?
Next article“లియో” మూవీలో ఈ పొరపాటును గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.