Ads
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. దేశ విదేశాలలో సైతం తెలుగు వాడి సత్తా చాటిన సినిమా ఇది. భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రం, తెలుగు సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రం.
95వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ ని గెలుచుకుంది. ఇందులో ప్రతి చిన్న సీన్ లో కూడా ఒక అద్భుతాన్ని చూపించాడు రాజమౌళి.
తన విజన్ కి టెక్నాలజీని జోడించి అద్భుతాలు సృష్టించాడు. ముఖ్యంగా కొమరం భీముడో సాంగులో అయితే రాజమౌళి చేసిన మ్యాజిక్ అసలు మనం గ్రహించలేం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా టెక్నాలజీ చుట్టూ తిరుగుతుంది. సాంకేతికత వాడకం పెరిగిన తర్వాత షూటింగులు చాలా సులభంగా చేస్తున్నారు. అసలు సాధ్యం కాదు అనుకునే సీన్ ని కూడా టెక్నాలజీని వాడి ప్రేక్షకులకు అద్భుతాలను చూపిస్తున్నారు. అలా సృష్టించిన ఒక అద్భుతమే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీముడో సాంగ్.
Ads
ఈ సాంగ్ లో ఎన్టీఆర్ నటన ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేలా ఉంటుంది. కేవలం కళ్ళతోనే తారక్ ఈ సీన్ లో భావాలను పలికిస్తాడు. ఈ సినిమాలో తారక్ ని రామ్ చరణ్ పట్టుకున్న తర్వాత బ్రిటిష్ అధికారులు శిక్ష విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని కట్టేసి రామ్ చరణ్ కొరడా తో కొడుతూ ఉంటాడు. ఈ ఘటన స్థానికంగా వేలకు వేలు జనాలు చూస్తున్నట్లు సాంగ్ లో చూపిస్తారు.
అయితే అక్కడ కేవలం చాలా తక్కువ మంది మాత్రమే జనాలు ఉంటారు. చిన్న ట్రిక్ ని ప్లే చేసి జక్కన్న అక్కడ వేలు మంది ఉన్నట్లు చూపించాడు. అదేమిటంటే లైవ్ లో కొంతమందిని పెట్టి ఆ తర్వాత ఎన్ లార్జ్ చేసుకుంటూ సీజీ వర్క్ లో వేల మంది జనాలు ఉన్నట్లు చూపిస్తారు. ఇప్పుడు ఈ సీజీ వరకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఏదైనా టెక్నాలజీని వాడటంలో జక్కన్న తర్వాతే ఎవరైనా. హ్యాట్సాఫ్ టు జక్కన్న.
watch video :