Ads
ఇటీవల కలకలం రేపిన సంఘటన ప్రవల్లిక అనే ఒక అమ్మాయి మృతి. తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఒక లెటర్ రాసి ప్రవల్లిక బ-ల-వ-న్మ-ర-ణా-ని-కి పాల్పడింది. కొంత మంది ఆ అమ్మాయి కెరీర్ కోసం ఎగ్జామ్స్ రాద్దాం అని ప్రభుత్వ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నా కూడా, సరైన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెంది ఇలా చేసింది అని అన్నారు.
కానీ మరి కొంతమంది మాత్రం ఇలా ఒక అమ్మాయి చనిపోడాన్ని ప్రభుత్వ పరీక్షలతో ముడి పెట్టడం సరైన విషయం కాదు అని, ఆ అమ్మాయి తన వ్యక్తిగత కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అన్నారు. పోలీసులు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే ఈ విషయం మీద కరీంనగర్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ స్పందించి మాట్లాడారు.
ఈ విషయంపై కేటీఆర్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. “మొన్న ప్రవల్లిక అనే ఒక అమ్మాయి హైదరాబాద్ లో మరణిస్తే, ఆ అమ్మాయి మృతిని రాజకీయం చేశారు. ఇవాళ ప్రవల్లిక తల్లి, తండ్రి, తమ్ముడు, ముగ్గురు నా దగ్గరికి వచ్చారు. మా అమ్మాయికి అన్యాయం జరిగిందంటూ ప్రవల్లిక కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. న్యాయం చేయమని కోరారు.”
Ads
“నేను వారికి ఒకటే మాట ఇచ్చాను. మీరెవరు బాధపడకండి. మీకు మీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. వాళ్ల తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. ఆర్థికంగా ఆదుకుంటాం. ఆ అమ్మాయి మృతి ఏదైతే జరిగిందో వాళ్లకి న్యాయం చేస్తాం” అని చెప్పాను అని కేటీఆర్ తెలిపారు.
గతవారం జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడంతో ప్రవల్లిక ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చనిపోయే ముందు ప్రవల్లిక ఒక లెటర్ కూడా రాసింది. ఆ లెటర్ లో తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ తనని క్షమించమని అడిగింది. అయితే వెంటనే పోలీసులు స్పందించి పరీక్షలకి ప్రవల్లిక అలా చేయడానికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టత ఇచ్చారు.
watch video :
ALSO READ : జగన్ లాంటి సీఎం మాకూ కావాలంటున్న తమిళనాడు ప్రజలు..! ఎందుకో తెలుసా.?