Ads
సాధారణంగా మన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల ప్రకారం, ఒక భర్త ఆరోగ్యం కోసం, అతని బాగు కోసం ఒక భార్య పూజలు చేస్తుంది అన్నట్టు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఒక భర్త తన భార్య కోసం పూజలు చేశాడు అన్నట్టు ఎక్కడా లేదు.
ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా భార్యలు మాత్రమే చేయాలా? భర్తలు చేయకూడదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తినా కూడా, అవన్నీ ప్రశ్నలు లాగానే మిగిలిపోయాయి. కానీ భార్యలని ప్రేమించే భర్తలు వారి కోసం ఏదైనా చేస్తారు.
దానికి ఉదాహరణగా జరిగినదే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన. వివరాల్లోకి వెళితే, కుప్పల స్వామి అనే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరునంపాలెంలో ఉంటారు. కుప్పల స్వామికి ఒక కాలు లేదు. అయినా కూడా ఇవి అన్నీ ఆలోచనలోకి రాకుండా అయన భార్య సత్యవతి కుప్పల స్వామిని చాలా బాగా చూసుకుంటారు. ఈ మధ్య సత్యవతి అనారోగ్యానికి గురయ్యారు.
Ads
దాంతో కుప్పల స్వామి, “తన భార్య మళ్ళీ ఆరోగ్యవంతురాలు అయితే, కాలి నడకన గుడికి వెళ్తాను” అని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కారు. సత్యవతి తిరిగి మాములు మనిషి అవ్వడంతో మొక్కు తీర్చుకోవడానికి 16 రోజులు 120 కిలోమీటర్లు ప్రయాణించి గుడికి చేరుకున్నారు. మొక్కు తీర్చుకున్నాక కుప్పల స్వామి మీడియాతో మాట్లాడారు. అయితే వీడియో చూసిన వారందరూ కూడా ఈ జంటని అభినందిస్తున్నారు.
“భార్యకి ఇబ్బందులు కలిగిస్తూ, వారిని బాధ పెడుతున్న ఎంతో మంది భర్తలు ఉన్న ఇలాంటి సమాజంలో, తన భార్య ఆరోగ్యం కోసం ఇంతలా తపించే భర్త ఉండడం చాలా అరుదైన విషయం” అని అంటున్నారు. అంతే కాకుండా, “తన భర్తని అంత బాగా చూసుకునే సత్యవతి లాంటి భార్య దొరకడం కూడా చాలా మంచి విషయం” అని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు వీరిద్దరిని చూసి చాలా మంది జంటలకి వీరు ఆదర్శం అవుతారు అంటూ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
ALSO READ : స్వాతంత్ర పోరాటం సమయం నాటి పెళ్లి ఆహ్వాన పత్రిక… పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.!