పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది..!

Ads

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా గడుపుతున్న విషయం తెలిసిందే.

అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది సినిమాలలో కంటే ఎక్కువగా రాజకీయాలలోనే గడుపుతున్నారు. ఈసారి ఎలా అయినా గెలవాలి అన్న కసితో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ చేతిలో 3,4 సినిమాలు ఉన్నాయి.

lady beside pawan kalyan

ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కి సంబంధించిన ఒక ఫోటో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ తో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ తో కలిసి ఫోటో దిగిన ఆ అమ్మాయి ఎవరు? ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో బాగా ఫేమస్‌. తెలుగులో చాలా సినిమాలు చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రోల్స్ లో , సాంగ్స్ లోనూ కనిపించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌తో ఒక్కసారిగా పాపులర్‌ అయి పోయింది.

Ads

lady beside pawan kalyan

కాబట్టి బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ చూసే వాళ్లు ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టేయచ్చు. ఇప్పటికే ఆ ముద్దుగుమ్మ ఎవరో అర్థమయ్యే ఉంటుంది. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ. పవన్‌ కల్యాణ్‌, డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో వచ్చిన సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌లో ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. అందులో పవన్‌ కల్యాణ్‌ అంటే పడి చచ్చిపోయే అమ్మాయి పాత్రలో కనిపించింది.

lady beside pawan kalyan

సిల్వర్‌ స్క్రీన్‌పై పవర్‌ స్టార్‌పై ఎంత ఇష్టాన్ని చూపించిందో నిజ జీవితంలోనూ అంతకు మించిన అభిమానాన్ని పెంచుకుందట ఈ బిగ్‌ బాస్‌ బ్యూటీ. కాగా ఆ ప్రస్తుతం ఈమె తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే ప్రేక్షకులను బాగా అలరించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది

Source : https://tv9telugu.com/entertainment/tollywood/do-you-recognize-this-actress-in-this-photo-with-pawan-kalyan-she-is-bigg-boss-7-telugu-fame-ashwini-sree-1121076.html

ALSO READ : సైలెంట్ గా రిలీజ్ అయిన స్టార్ హీరో సినిమా..! ఎలా ఉందంటే..?

Previous articleఆర్య నటించిన ఈ వెబ్ సిరీస్ చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?
Next articleపొలిమేర 2 బాటలో రాబోతున్న మరో సినిమా.. అదేంటంటే?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.