Ads
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22 తారీఖున రామ విగ్రహ ప్రతిష్ట, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి ప్రముఖులు హాజరు కానున్నారు.
ఇప్పటికే శ్రీరాముని అక్షింతలు దేశవ్యాప్తంగా కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు హిందువుల ఇళ్లలకు చేరాయి. అయోధ్య మందిరం ప్రారంభమైతే దేశంలో హిందూ సంస్కృతి మరింత పెరిగి భారతదేశ వైభవమే పెరిగిపోతుంది.
అయితే అయోధ్య రామ మందిరం నిర్మాణం పుణ్యమా అంటూ అయోధ్య చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.అయోధ్యలో స్థిరాస్తి ధర నాలుగు రెట్లు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే అయోధ్యలో స్థిరాస్తి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. అయోధ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Ads
అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల మాత్రమే కాకుండా అయోధ్య శివార్లలో కూడా భూముల ధరలు భారీగా పెరిగాయని అనరాక్ రీసెర్చ్‌ను ఉటంకిస్తూ మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది. ఉదాహరణకు ఫైజాబాద్ రోడ్ ప్రాంతంలో 2019లో భూమి ధర చదరపు అడుగుకు రూ.400 నుంచి రూ.700 మధ్య ఉంది. 2023 అక్టోబర్ నాటికి అదే ప్రాంతంలో చదరపు అడుగు రూ.1,500 నుంచి రూ.3,000లు పలుకుతోంది.
ఇదే తరహాలో అయోధ్య నగరం సగటు భూమి ధర 2019లో చదరపు అడుగుకు రూ.1,000– రూ.2,000 ఉండేది. ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.4,000 నుంచి రూ.6,000 వేలు ఖర్చు చేయాలి. అయోధ్య రామ మందిరం పూర్తయిన తర్వాత రాముని దర్శనానికి దేశ నలుమూలల నుండే కాకుండా విదేశాలను కూడా భక్తులు వస్తారు. దీనితో ఇక్కడ టెంపుల్ టూరిజం కూడా పెరుగుతుంది. ఎటు చూసినా అయోధ్య రామ మందిరం వల్ల ఈ స్థానానికి ప్రాచుర్యం లభిస్తుందని మాత్రం నిజం