Ads
తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడు రాజబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా రాజబాబు పేరు చెప్పగానే హాస్య నటి రమా ప్రభతో ఆయన నటించిన సీన్స్ వెంటనే గుర్తుకు వస్తాయి. 1960 నుంచి 1980 లలో ప్రేక్షకులకు రాజబాబు బాగా సుపరిచితుడు.
Ads
ఇప్పుడు కమెడియన్ బ్రహ్మానందం ఎలా అయితే హాస్య బ్రహ్మలా పేరు గాంచారో, అప్పట్లో రాజబాబు అంత కన్నా ఎక్కువ పాపులారిటీ పొందారు. ఎంతలా అంటే రాజబాబు డేట్స్ దొరికిన అనంతరమే ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహా నటులు డేట్స్ ఇచ్చేవారంటే ఆ సమయంలో రాజబాబుకు ఉన్న క్రేజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా రాజబాబు హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేవాడని ఆయన సహ నటులు చెప్పేవారు.రాజబాబు నిజమైన పేరు అప్పలరాజు. 1937లో జన్మించిన రాజబాబు 1983లో కన్నుమూశారు. ఆయన రాజమండ్రిలో స్కూల్ టీచర్ గా చేశారు. ఆ తరువాత సినిమాల్లో నటించాలని ఆసక్తితో స్టార్ దర్శక, నిర్మాతల పిల్లలకు మద్రాసులో ట్యూషన్ చెబుతూ, సినిమా ప్రయత్నాలు కూడా చేసేవారు. అలా ఆయన సమాజం అనే చిత్రం ద్వారా 1960లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
20 ఏళ్ల పాటు హాస్యనటుడిగా రాజబాబు కొన్ని వందల చిత్రాలలో నటించారు. ఆయన తెలుగుతో పాటు తమిళ చిత్రాలలో నటించి అక్కడ కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అంతే కాకుండా రాజబాబు కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించారు. ఆ క్రమంలో ఆయన కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారు. ఎన్నో కష్టాలు పడిన రాజబాబు పేదరికం నుండి ఈ స్థాయికి ఎదిగారు. అయితే ఆయన తనకు ఉన్నంతలోనే ఎంతోమందిని ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టేవారు.
కానీ ఆ తరువాత కాలంలో ఒక చిత్రానికి రాజబాబు నిర్మాతగా మారాడు. అయితే ఆ సినిమా కారణంగా ఆయన సంపాదించిన డబ్బుని పోగొట్టుకున్నారని, ఆ సినిమా వల్ల రాజబాబు రోడ్డున పడ్డారని తెలుస్తోంది. అయితే ఆయన దగ్గర డబ్బు ఉన్న టైమ్ లో ఆయనతో ఉన్నవారంత డబ్బు పొగానే రాజబాబును పట్టించుకోలేదని సమాచారం. ఆ తర్వాత ఆయనకు గొంతు క్యాన్సర్ వచ్చి, మాట పడిపోయింది. అలా రాజబాబు అనారోగ్యంతో 1983లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీలను చూసుకుంటూ ధనవంతులుగా అమెరికాలో స్థిరపడ్డారని తెలుస్తోంది.
Also Read: ప్రాణస్నేహితుడు మరణించినా చివరి చూపుకు వెళ్ళని రజినీకాంత్.. ఎందుకో తెలుసా?