Ads
తమిళ్ స్టార్ హీరో ఇళయదళపతి హీరోగా, లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తెరకెక్కిన చిత్రం లియో. దసరాకు థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ మూవీపై ఇప్పటికే బాగా హైప్ క్రియేట్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ బాగా వైరల్ అయింది. ఇప్పటివరకు విజయ్ కెరియర్ లో అత్యంత బిజినెస్ చేసిన మూవీ లియో అని టాక్.
అక్టోబర్ 19న ఈ చిత్రం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.మూవీ రిలీజ్ కూడా కాకముందే ప్రొడ్యూసర్ కి ఈ చిత్రం థియరిటికల్ , నాన్ థియరిటికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే 500 కోట్ల రూపాయల వరకు వచ్చాయని సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ తన సెన్సార్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి…
Ads
ఈ చిత్రం నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మాత్రం మూవీలో ఫైట్ సీన్స్ టాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అని అర్థం అయిపోతుంది . అయితే ఇందులో మరొక విశేషమేమిటంటే చాలా వరకు ఫైట్స్ రియలిస్టక్ గా ఉండడం కోసం విజయ్ ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ కి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.
దానికి తోడు ఈ మూవీలో మొత్తం 13 కట్స్ సెన్సార్ బోర్డ్ సూచించినట్లుగా సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ద్వారా స్పష్టం అవుతుంది. ఇక సినిమాలో సూచించిన కట్స్ లో కొన్ని పదాలను అలాగే కొన్ని సీన్లను ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి సెన్సార్ మెంబర్స్ సూచనల మేరకు సినిమా నిడివిని 47 సెకండ్లు తగ్గించినట్లు తెలుస్తోంది.