Ads
రోజు రోజుకి అభివృద్ధి చెందడం వలన ప్రతిదీ కూడా మనకి ఈజీ అయ్యిపోతోంది. టెలిఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ ఎలా వచ్చిందో.. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అలానే జరుగుతోంది. రోజు రోజుకి కొత్త కొత్త సదుపాయాలు వస్తున్నాయి. పైగా ఈ రోజుల్లో ప్రయాణం చేయడం కూడా ఈజీ. పూర్వం అయితే ఎద్దుల బండి గుర్రాల బండి మీద ప్రయాణం చేసేవారు.
రాను రాను టెక్నాలజీ పెరగడం వలన కార్లు, హెలికాప్టర్లు ఇలా చాలా వచ్చాయి. అయితే కారులో ప్రయాణం చేయడం చాలా మందికి ఇష్టం.
ఎంతో ఈజీగా మనం అలసిపోకుండా ట్రావెల్ చేయొచ్చు. త్వరగా మన పనులు మనం పూర్తి చేసుకుని రావచ్చు. పైగా కార్లలో కూడా రోజు రోజుకీ టెక్నాలజీ పెరిగి పోతోంది. కొత్త కొత్త ఫీచర్స్ ని కార్లలో యాడ్ చేస్తూ ఉంటారు. కొత్త మోడల్స్ లో కొత్త ఫీచర్స్ వస్తుంటాయి. కొత్త కార్లు రోజు రోజుకీ వస్తూనే ఉన్నాయి పైగా వాటిలో చాలా మార్పులు కూడా చేస్తున్నారు. ఇక కార్ విండోస్ మీద ఉండే గీతల గురించి తెలుసుకుందాం.
Ads
ఎప్పుడైనా మీరు కార్ విండో మీద చూసినట్లయితే గీతలు ఉంటాయి అయితే అసలు గీతలు ఎందుకు ఉంటాయి..? సరదాగా డిజైన్ లాగ పెట్టారా..? నిజంగా డిజైన్ అని అనుకుంటే అది పొరపాటే. విండోస్ మీద ఉండే ఈ లైన్స్ కూడా అవసరం. మరి ఆ గీతల్ని ఎందుకు పెడతారు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. కారు విండోస్ మీద వుండే ఈ గీతాల్ని Defoggers డీఫాగర్స్ అని అంటారు. ఇవి ఎలక్ట్రికల్ గీతాలు. వీటి ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. దీని వలన తేమ మంచు తొలిగిపోయి క్లియర్ గా కనపడుతుంది. ఈ చిన్న గీతలే ప్రయాణికులకు సౌకర్యాన్ని ఇస్తాయి.