Ads
కేరాఫ్ కంచెరపాలెం మూవీతో గుర్తింపు పొందిన కార్తిక్ రత్నం హీరోగా నటించిన సినిమా ”లింగోచ్చా”. ఈ చిత్రంలో హీరోయిన్ గా సుప్యార్ధ్ సింగ్ నటించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- మూవీ: లింగోచ్చా
- తారాగణం: కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ కే, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్,శరత్ కుమార్ తదితరులు
- దర్శకత్వం: ఆనంద్ బడా
- నిర్మాత: యాదగిరి రాజు
- సినిమాటోగ్రఫి: రాకేష్
- మ్యూజిక్: బికాజ్ రాజ్
- రిలీజ్ డేట్: 2023-10-27కథ:
శివ(కార్తిక్ రత్నం)పాత బస్తీలో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. అతని తండ్రి బార్బర్ గా పనిచేస్తుంటాడు. శివ ముస్లిం ఫ్యామిలీకి చెందిన నూర్జహాన్‌ను చిన్నతనంలో మొదటిసారి చూసినప్పటి నుండి ప్రేమిస్తుంటాడు. చిన్నప్పటి నుండి శివ, నూర్జహాన్ లు ఒకరినొకరు ఇష్టపడుతారు. సడెన్ గా నూర్జహాన్ దుబాయ్‌కి వెళ్తుంది.
శివ ఆమెను తలచుకుంటూ బ్రతుకుతుంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత నూర్జహాన్ హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే ఎంబీబీఎస్ చదువుతుంటుంది. నూర్జహాన్ దుబాయ్‌కి ఎందుకు వెళ్లింది? ప్రేమలో ఉన్న ఇద్దరికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ? నూర్జహాన్, శివ ప్రేమ చివరికి ఏ మజిలీ చేరింది అనేది మిగిలిన కథ.
Ads
విశ్లేషణ:
డైరెక్టర్ ఎంచుకొన్న పాయింట్ బాగున్నప్పటికీ, సన్నివేశాల పరంగా కాస్త కొత్తగా ఆలోచిస్తే బాగుండేదనే భావన కలుగుతుంది. ఓల్డ్ సిటీ వాతావరణం, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కార్తీక్ రత్నం శివ పాత్రలో చక్కగా నటించాడు. డైలాగ్స్, డ్యాన్స్‌లు, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. సుప్యర్ధ సింగ్ నూర్జహాన్ పాత్రలో ఒకే అనిపించారు. ఉత్తేజ్, తాగుబోతు రమేష్ అలరించారు.
ప్లస్ పాయింట్స్: - హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి లవ్ స్టోరీ,
- కార్తిక్ రత్నం
- డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- పేరున్న నటీనటులు లేకపోవడం,
- టైటిల్
- రొటీన్ సీన్లు
రేటింగ్:2.5/5చివరి మాట:
లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది. లింగోచ్చా అనేది ఒక ఆట పేరు. 7 రాళ్ల పలకలు ఒకదానిపై ఒకటి పెట్టి బాల్ తో కొట్టే ఆట. తెలంగాణలో ఈ ఆటను వివిధ పేర్లతో పిలుస్తారు.
watch trailer :