Ads
అయోధ్యలో రాముని మందిర ప్రారంభోత్సవానికి దేశమంతా సంసిద్ధమయింది. దేశ ప్రజలందరూ ఈ వేడుక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే శ్రీరాముని అక్షింతలు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి చేరాయి.
జనవరి 22 తారీఖున బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.శిల్పి అరుణ్ యోగ్‌రాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే ప్రజలంతా రామ నామ స్మరణలో మునిగి తేలుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం పాలు పంచుకోనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి.
Ads
అయితే దీన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే 500 నోట్ పైన రాముని చిత్రాన్ని ముద్రించనున్నారు అని. జనవరి 22 తారీఖున కొత్త 500 నోట్లను విడుదల చేస్తారని వాట్సాప్ లో ఫార్వార్డ్లు చేస్తున్నారు. ఈ వార్తలు నిజం ఏంటో తెలియదు కానీ ఈ వార్త అయితే బాగా వైరల్ అయింది. అయితే ప్రస్తుతం ఇండియన్ కరెన్సీ మీద మహాత్మా గాంధీజీ చిత్రం మాత్రమే ఉంది.
అయితే ఒక సంవత్సరం క్రితం రవీంద్రనాథ్ ఠాగూర్,అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల చిత్రాలు ముద్రిస్తారు అది నిజం కాదు అని ఆర్బిఐ ప్రకటించింది. ఇప్పుడు వైరల్ అవుతున్న శ్రీరాముడి 500 నోట్ పై కూడా ఆర్బిఐ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఫ్యాక్ట్ చెక్ వారు మాత్రం ఇది ఎడిటింగ్ చేసిన ఫోటో అని తేల్చారు. ఈ వార్తలో నిజం లేదని తేలిపోయింది. అలాంటిది ఏదైనా ఉంటే ఆర్.బి.ఐ అధికారిక ప్రకటన చేస్తుంది