Ads
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఎన్ని బంధాలు ఏర్పడినప్పటికి అవి వివాహ బంధానికి కన్నా ఎక్కువ కావు అని చెప్పవచ్చు. ఇక ప్రతి ఒక్కరి లైఫ్ పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అన్నట్టుగా ఉంటుంది.
Ads
మరి జీవితంలో ఇంత ముఖ్యమైన పెళ్లిని జాగ్రత్తగా, చూసుకుని చేసుకోవాలి. ఇక క్యాలెండర్ ప్రకారం అయితే జనవరి నుంది డిసెంబర్ దాకా మొత్తం పన్నెండు నెలలు ఉంటాయి. ఈ 12 నెలల్లో కొన్నింటిని వివాహాలకు, శుభకార్యాలు చేయడానికి చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన నెలలుగా పరిగణిస్తారు. అలా కొన్ని నెలలు మాత్రమే వివాహాలకు ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ పన్నెండు నెలలలో ఏ నెలలో వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం..ఈ పన్నెండు నెలలలో నవంబర్, డిసెంబర్ లో వివాహం చేసుకునే వారి లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నెలలలో వివాహం చేసుకున్న వారికి అదృష్టం కూడా కలిసి వస్తుందంట. అది మాత్రమే కాకుండా ఈ నెలలలో వివాహం చాలామందికి ఆదర్శంగా నిలుస్తారంట. సంఖ్యాశాస్త్రంలో చెప్పిన ప్రకారం ఈ నెలలలో వివాహం చేసుకున్నవారు ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారని తెలుస్తోంది.
సంఖ్యా శాస్త్ర నిపుణులు నవంబర్, డిసెంబర్ లో వివాహం చేసుకున్న జంట జీవితం చాలా సంతోషంగా ఉంటుందని , ఈ నెలల్లో వివాహం చేసుకున్న వారి లైఫ్ లో ఎన్నో శుభ ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్ లలో కూడా ఎక్కువగా వివాహాలు జరుగుతుంటాయి. అయితే వీరితో పోల్చినపుడు నవంబర్, డిసెంబర్ లో వివాహం చేసుకునే వారి లైఫ్ చాలా సంతోషంగా ఉంటుదని తెలుస్తోంది.
Also Read: భర్తకి ఎడమ వైపే భార్య ఎందుకు ఉండాలి..? దాని వెనుక ఎంతో పెద్ద కారణం వుంది..!