Ads
ఎంతో మంది హీరోల కొడుకులు ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగు పెడుతున్నారు. అలా ఒక స్టార్ హీరో కొడుకు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ హీరో సినిమా విడుదల అయ్యింది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కొడుకు హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అమీర్ ఖాన్ కొడుకు పేరు జునైద్ ఖాన్. జునైద్ ఖాన్ నటించిన మహారాజ్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. కానీ ఈ సినిమా డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించారు. జైదీప్ అహ్లావత్ ఒక ముఖ్య పాత్ర పోషించారు.
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. కానీ ఈ సినిమా మీద ఎన్నో వివాదాలు వచ్చాయి. ఒక జర్నలిస్ట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. అయితే, ఇందులో హిందూ మతానికి సంబంధించిన విషయాలని సరిగ్గా చూపించలేదు అంటూ కొంత మంది కోర్టుని ఆశ్రయించారు. గుజరాత్ కోర్టు వారు సినిమా చూసి, ఇందులో వివాదాస్పదంగా ఉండే అంశాలు లేవు అని సినిమా బృందానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఇది నిజ జీవిత ఆధారంగా రూపొందిన సినిమా. ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన కర్సన్ దాస్ ముల్జీ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.
Ads
ఈయన జీవితం ఆధారంగా ప్రముఖ గుజరాతి రచయిత సౌరభ్ షా 1862 లో మహారాజ్ లిబెల్ కేస్ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాకి సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. సినిమా సాధారణ సినిమా లాగా ఉండదు. సినిమాలో ఉండే అంశాలు ఈ సినిమాలో లేకుండానే చూసుకున్నారు. డాక్యుమెంటరీ కంటే కాస్త ఎక్కువ స్థాయిలో రూపొందించారు. సినిమాల్లో ఉండేలాగా ఈ సినిమాలో అయితే ఎలాంటి అంశాలు ఉండవు. సెట్టింగ్స్, కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా ఇందులో ఎక్కువగా భారీగా ఉండేలాగా చూసుకున్నారు.
పర్ఫార్మెన్స్ పరంగా అందరూ బాగా నటించారు. మొదటి సినిమా అయినా కూడా జునైద్ ఖాన్ మొదటి సినిమా అని అనిపించకుండా నటించారు. జైదీప్ అహ్లావత్ కూడా ఈ సినిమాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర పోషించారు. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేకి సినిమాలో ఉన్న పాత్ర చిన్నదే. తన పాత్ర పరిధి మేరకు నటించారు. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. డబ్బింగ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకున్నారు. సినిమా అంతా కూడా అప్పటి కాలంలో జరుగుతుంది కాబట్టి, 18 వ శతాబ్దంలో ఉన్నట్టు సినిమా సెట్ డిజైన్ అంత కూడా ఉండేలాగా చూసుకున్నారు.