Ads
ఎన్నో భారీ అంచనాల మధ్య గుంటూరు కారం సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : గుంటూరు కారం
- నటీనటులు : మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి.
- నిర్మాత : ఎస్. రాధా కృష్ణ(చినబాబు)
- దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
- సంగీతం : తమన్ ఎస్
- విడుదల తేదీ : జనవరి 12, 2024
స్టోరీ :
వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరాం) కొడుకు వైరా వెంకటరమణ (మహేష్ బాబు). చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరి రావు) దగ్గర రమణ పెరుగుతాడు. వసుంధర మరొక పెళ్లి చేసుకొని తెలంగాణలో న్యాయశాఖ మంత్రి అవుతుంది. అయితే మొదటి పెళ్లి, మొదటి కొడుకు తన కూతురి రాజకీయ జీవితానికి అడ్డు రాకూడదు అనుకున్న వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) రమణతో ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకోవాలి అనుకుంటాడు.
అసలు వసుంధరకి, రమణకి ఉన్న గొడవేంటి? వీళ్ళిద్దరూ కలిశారా? రమణ అగ్రిమెంట్ సైన్ చేశాడా? ఒంటరితనం వల్ల రమణ పడిన బాధ వసుంధరకి, సత్యంకి తెలుస్తుందా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
ఈ సినిమా మీద అంత ఎక్కువగా అంచనాలు నెలకొనడానికి కారణం వీరిద్దరి కాంబినేషన్. ఖలేజా వీరిద్దరి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా దాదాపు ఒకటే ఫార్ములాతో నడుస్తాయి. జులాయి సినిమా కాస్త డిఫరెంట్ గా ఉన్నా కూడా ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా తండ్రి సెంటిమెంట్, లేకపోతే తల్లి సెంటిమెంట్ అనే విషయం మీద నడుస్తాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే ఉంది.
Ads
ఒక గురూజీ టెంప్లేట్ సినిమాలో మహేష్ బాబు నటిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది. మహేష్ బాబు లోని నటుడిని చూసి చాలా కాలం అయ్యింది. ఈ సినిమాతో మహేష్ బాబుకి నటనకి ఆస్కారం ఉన్న ఒక పాత్ర దొరికింది. నటన మాత్రమే కాదు. ఈ సినిమాలో మహేష్ బాబు డాన్స్ విషయంలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఒక కొత్త మహేష్ బాబుని చూసినట్టు అనిపిస్తుంది. ఒక సింపుల్ స్టోరీ ఉన్న సినిమాని మహేష్ బాబు ఇంత ఎలివేట్ చేశారు.
అలాంటిది త్రివిక్రమ్ ఇంకా మంచి కథ రాసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేది. చాలా తెలిసిన కథ. కొత్తదనం ఎక్కడా అనిపించదు. కాకపోతే నటుల మార్పు వల్ల ఏమో కానీ సినిమా చూడగలుగుతాం. బహుశా గురూజీ మ్యాజిక్ అంటే ఇదే ఏమో. తెలిసిన కథని కూడా మళ్లీ మళ్లీ చెప్పగలుగుతారు. హీరోయిన్స్ కి పెద్దగా స్కోప్ లేదు. మీనాక్షి చౌదరి చిన్న పాత్రలో చేశారు అంతే. శ్రీలీలని మాత్రం కేవలం డాన్స్ కోసమే తీసుకున్నారు. యాక్టింగ్ విషయంలో మాత్రం శ్రీలీల చాలా శ్రద్ధ తీసుకోవాలి.
మిగిలిన అందరూ నటీనటులు కూడా అనుభవం ఉన్న నటీనటులు కాబట్టి వారి పాత్రలకు తగ్గట్టు వారు చేశారు. త్రివిక్రమ్ రాసుకున్న కొన్ని పాత్రలు బాగున్నాయి. కొంచెం కామెడీతో, కొంచెం వెటకారంతో ఆ పాత్రలు రాసుకున్నారు. కానీ వాళ్లకి ఇంకా కొంచెం స్క్రీన్ టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేది. తమన్ అందించిన పాటలు అంత గొప్పగా ఏమీ లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మామూలుగా ఉంది అంతే. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- మహేష్ బాబు
- కొన్ని డైలాగ్స్
- నిర్మాణ విలువలు
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- తెలిసే కథ
- కొంత ల్యాగ్ గా అనిపించే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
3/5
ఫైనల్ గా:
త్రివిక్రమ్ నుండి కొత్త కథలు ఆశించడం అనేది మన తప్పు అవుతుంది ఏమో. త్రివిక్రమ్ కొత్త కథ రాసి దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి గొప్ప కథ ఆశించకుండా, త్రివిక్రమ్ స్టైల్ లో మహేష్ బాబుని ఎలా చూపించారు? అసలు మహేష్ బాబు ఇలాంటి ఒక పాత్రని ఎలా చేశారు? అనేది చూడాలి అనుకుంటే గుంటూరు కారం సినిమా ఒక మంచి డీసెంట్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :