Ads
ప్రముఖ మలయాళ నటి రెంజూష మీనన్ బలవన్మరణం కేరళ రాష్ట్రంలో సంచలనం కలిగించింది. రెంజూష మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తిరువనంతపురంలోని ఆమె అపార్ట్‌మెంట్‌లో రెంజూష శవమై కనిపించింది.
రెంజూష ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చనిపోవడానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. రెంజూష గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
మలయాళ సీరియల్ ‘స్త్రీ’ ద్వారా రెంజూషా మీనన్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత నిజాలట్టం, మకలుడే అమ్మ, స్త్రీ మరియు బాలమణి వంటి అనేక సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో నటించింది. కొచ్చికి చెందిన ఆమె ముందు యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత ‘స్త్రీ’ అనే సీరియల్‌తో నటిగా మారింది. సిటీ ఆఫ్ గాడ్, బాంబే మార్చి 12, మెరిక్కుండోరు కుంజడు, లిసమ్మయుడే వీడు వంటి సినిమాల్లో నటించింది.
ఆఖరిసారిగా ఆనందరాగం అనే టెలివిజన్ షోలో లీడ్ రోల్ చేసింది.రెంజూష పలు సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఆమె క్లాసిక్ డ్యాన్సర్, భరతనాట్యంలో పట్టా కూడా తీసుకుంది. రెంజూష తన భర్తతో కలిసి తిరువనంతపురంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అందులో రీల్స్ చేస్తూ రెంజూష ఉత్సాహంగా కనిపించింది. కొద్ది గంటలకే ఆమె కన్నుమూయడం ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆమె ఆ-త్మ-హ-త్య విషయం తెలిసిన మలయాళ ఇండస్ట్రీ సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఆమె మరణం పట్ల వారు సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెంజూషా మీనన్ తీవ్రమైన ఆర్థిక సమస్యలలో ఉన్నట్లు తెలస్తోంది. వాటి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read: “కృష్ణ ముకుంద మురారి” సీరియల్ లో ఇలా ఎందుకు చేశారు..? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి..?