Ads
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రజలకి సుపరిచితులు. ఆయన డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటిస్తూనే, మరొక పక్క మలయాళం డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడు మమ్ముట్టి హీరోగా నటించిన భ్రమయుగం సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం: బ్రహ్మయుగం
- నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, అమల్దా లిజ్, సిద్ధార్థ్ భరతన్.
- దర్శకుడు: రాహుల్ సదాశివన్
- సంగీతం: క్రిస్టో జేవియర్
- నిర్మాత : రామచంద్ర చక్రవర్తి, ఎస్. శశికాంత్
- రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 23, 2024
కథ:
దేవన్ (అర్జున్ అశోకన్) చాలా మంచి గాయకుడు. దేవన్ తక్కువ కులానికి చెందినవాడు. ఒకసారి తన స్నేహితుడితో కలిసి ఒక అడవికి వెళ్తాడు. అక్కడ తప్పిపోయి, వాళ్ళ ఊరికి వెళ్లే దారి తెలియక, అడవిలో ఉన్న ఒక పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఒక వంటవాడు (సిద్ధార్థ్ భారతన్), ఆ ఇంటి యజమాని కుడుమన్ పొట్టి (మమ్ముట్టి) ఉంటారు. దేవన్ తక్కువ కులానికి చెందిన వాడు అని తెలిసినా కూడా తనకి అతిధి మర్యాదలు చేయమని కుడుమన్ పొట్టి తన వంట వాడికి సూచిస్తాడు.
అక్కడ దేవన్ కొన్ని సంఘటనలు ఎదుర్కొంటాడు. దాంతో ఇంటి నుండి పారిపోవాలి అని ప్రయత్నిస్తాడు. అక్కడ ఏం జరిగింది? అసలు ఈ కుడుమన్ పొట్టి ఎవరు? అడవిలో అంత బాధ పడ్డ బంగ్లాలో ఎందుకు ఉంటున్నాడు? దేవన్ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సాధారణంగా ఎవరైనా ఒక స్టార్ హీరో ఒక ఇమేజ్ వచ్చాక, అందులో ఉన్న నియమాల వల్ల కొన్ని పాత్రలకి మాత్రమే పరిమితం అవుతారు. అవన్నీ బ్రేక్ చేసి, తాము స్టార్లు మాత్రమే కాదు, మంచి నటులు కూడా అని నిరూపించుకోవడానికి తపన పడే నటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే వారిలో చాలా మంది యంగ్ హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోల్లో ప్రయోగాలు చేసేవారు కొంత మంది మాత్రమే ఉన్నారు. వారిలో మమ్ముట్టి ముందు వరుసలో ఉంటారు. మమ్ముట్టి వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు.
Ads
తన ఇమేజ్ కి తగ్గ కథలు చేసుకోవచ్చు. కానీ అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి ప్రయోగాత్మక సినిమాలకి, అలా ప్రయోగాత్మక కథలను రూపొందించే దర్శకులను ప్రోత్సహించడానికి ముందుంటున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర డిజైన్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. సినిమా మొత్తం ఒక చిన్న పాయింట్ మీద నడుస్తుంది. కానీ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా నడిపించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే.
ఇంకొక విషయం ఏంటంటే, సినిమా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. ఇలాంటి ప్రయోగం చేయడం చాలా గొప్ప విషయం. అది కూడా మమ్ముట్టి లాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ పెట్టడం అనేది ఇంకా గొప్ప విషయం. మమ్ముట్టి కుడుమన్ పొట్టి అనే పాత్రలో చాలా బాగా నటించారు. సినిమా మొత్తం ఒకే డ్రెస్ తో ఉంటారు. అసలు సినిమా చూస్తున్నంత సేపు కూడా మమ్ముట్టి అనే వ్యక్తి మనకి గుర్తుకు కూడా రారు. అంత బాగా నటించారు. ఇప్పుడు కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు అనేది ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది.
మిగిలిన నటులు కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. సినిమాకి మరొక ప్రధాన బలం క్రిస్టో జేవియర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమా ఇంకా థ్రిల్లింగ్ గా అనిపించడానికి ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సహాయపడింది. షఫీక్ మహమ్మద్ అలీ సినిమాటోగ్రఫీ మరొక హైలైట్ అయ్యింది. సినిమా కథ మనకి తెలిసినదే అయినా కూడా ప్రేక్షకులని కట్టిపడేసేలాగా చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా స్లోగా నడుస్తుంది. కథ అంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది.
ప్లస్ పాయింట్స్:
- మమ్ముట్టి నటన
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
- థ్రిల్లింగ్ గా అనిపించే కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్:
- స్లోగా సాగే ఫస్ట్ హాఫ్
- కొన్ని పాత్రల ప్రాధాన్యత సరిగ్గా చూపించకపోవడం
రేటింగ్:
3.25/5
ఫైనల్ గా:
మమ్ముట్టి కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా. కాస్త స్లోగా నడిచినా పర్లేదు, ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని చూడాలి, మంచి నటులు ఉన్న సినిమాని చూడాలి అని అనుకునే వాళ్లని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఇటీవల వచ్చిన థ్రిల్లర్స్ లో ఒక మంచి థ్రిల్లర్ సినిమాగా బ్రహ్మయుగం సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఒకే లాగ కనిపించే 13 మంది హీరోయిన్స్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!