YATRA-2 REVIEW : “వైయస్ జగన్మోహన్ రెడ్డి” బయోపిక్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితం ఆధారంగా 2019 లో రూపొందిన సినిమా యాత్ర. ఈ సినిమాకి సీక్వెల్ గా యాత్ర-2 సినిమాని రూపొందించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాలో, జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం: యాత్ర-2
  • నటీనటులు: మమ్ముట్టి, జీవా.
  • దర్శకుడు: మహి వి రాఘవ్
  • సంగీతం: సంతోష్ నారాయణన్
  • నిర్మాత : శివ మేక
  • రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 8, 2024

yatra 2 review

కథ:

వైయస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి), తన కొడుకు జగన్మోహన్ రెడ్డి (జీవా) ని కడప ఎంపీ కాండిడేట్ గా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అనుకోకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణిస్తారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? తన కుటుంబానికి అండగా ఎలా నిలిచారు? ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించారు? రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

yatra 2 review

విశ్లేషణ:

దాదాపు 5 సంవత్సరాల క్రితం ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ అయిన యాత్ర ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఈ సినిమా రూపొందించారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం, ఆ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవన్నీ ఈ సినిమాలో చూపించారు. అయితే, సినిమాలో చాలా ఎమోషనల్ గా హై ఇచ్చే సీన్స్ ఉండేలాగా చూసుకున్నారు.

సినిమా కథ అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి మీరే నడుస్తుంది. అంటే, మిగిలిన వాళ్ళ పాత్రలు కనిపిస్తాయి. కానీ ఎక్కడ మెట్టు దించేలాగా కాకుండా మామూలుగానే వారి పాత్రలు ఉంటాయి. ఈ సినిమా సబ్జెక్ట్ చాలా సెన్సిబుల్ గా ఉంటుంది. డైరెక్టర్ మహి వి రాఘవ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవన్నీ బాగా రాసుకున్నారు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తంలో మనం ఒక్కచోట కూడా జీవా అనే ఒక హీరోని చూడం.

Ads

jiiva remuneration for yatra 2 movie

వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర కోసం ఆయన తనని తాను మార్చుకున్న తీరు చాలా బాగుంది. వాకింగ్ స్టైల్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే ఉండేలాగా చూసుకున్నారు. స్వతహాగా తెలుగువారు అయినా కూడా, జీవా ఎక్కువ తమిళ్ సినిమాలు మాత్రమే చేశారు. కానీ ఈ సినిమా కోసం తనని తాను ఇంతగా మార్చుకోవడం అనేది అభినందించాల్సిన విషయం. మమ్ముట్టి కూడా కనిపించిన కొంచెం సేపు బాగా చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు.

yatra 2 review

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. కాకపోతే ఇంకా కొంచెం బాగుంటే పాటల ద్వారా ఎమోషన్స్ ఇంకా బాగా వచ్చి ఉండేవి. మది అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కలర్ గ్రేడింగ్ అంతా కూడా ఒక మంచి పొలిటికల్ డ్రామా చూస్తున్నాం అనే ఒక ఫీల్ ఇస్తుంది. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. కొన్ని చోట్ల మాత్రం సినిమా స్లోగా నడుస్తుంది. అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • కొన్ని ఎమోషనల్ సీన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • ఎమోషనల్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న పాటలు
  • స్లోగా నడిచే కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్:

3.25/5

ఫైనల్ గా:

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పొలిటికల్ డ్రామా అనే ఒక అంశం మీద సినిమాలు రావడం చాలా తక్కువ. ఎందుకంటే ఇది అంత సున్నితమైన అంశం. అలాంటి విషయం మీద సినిమాలు వచ్చినా కూడా వాటిలో కొన్ని మాత్రమే గుర్తుండిపోయే అంత బాగా చిత్రీకరిస్తారు. అలాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇటీవల వచ్చిన ఎమోషనల్ పొలిటికల్ డ్రామా సినిమాల్లో ఒకటిగా యాత్ర-2 సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : అసలు ఎవరు ఈ ముఖేష్ గౌడ..? ఎందుకు అతనికి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది..?

Previous articleవైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాన హీరో ఆయనేనా..? ఆ పోస్టర్ లో నిజం ఎంత..?
Next article“లాల్ సలామ్” తెలుగు ట్రైలర్ లో “రజినీకాంత్” కి మనో బదులు ఆ హీరో డబ్బింగ్..! అసలు సెట్ అవ్వలేదు కదా..?