Ads
తిరుపతి జూపార్క్ లో సింహం ఎంక్లోజర్ లోకి దూకిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అతని జేబులో దొరికిన ఫోన్ నెంబర్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు విషయం చేరవేశారు.
తర్వాత ఎందుకు ఎండ్లోజర్ లోకి దూకాడు ఆత్మహత్య చేసుకోవటానికా లేదా సెల్ఫీ కోసమా లేదంటే మతిస్థిమితం సరిగా లేదా అనే విషయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడి నిజా నిజాలు తెలుసుకుంటామన్నారు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే రాజస్థాన్ కి చెందిన ప్రహ్లాద్ గుజ్జర్. అసలు గురువారం ఏం జరిగిందంటే జూ పార్కులో ఉన్న సింహాల ఎన్ క్లోజర్ లో మూడు సింహాలు ఉంటాయి. రెండు మగవి, ఒకటి ఆడది. సెక్యూరిటీ బోనులో ఉండే మూడు సింహాల్లో ఒక సింహాన్ని విజిటర్స్ సందర్శనార్థం ఎన్ క్లోజర్ లోకి వదులుతారు. మరుసటి రోజు మరొక దానిని వదులుతారు. అలా ఆరోజు దొంగల పూర్ పేరు గల సింహం ఎన్ క్లోజర్ లో ఉంది.
Ads
మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ప్రహ్లాద్ ఎన్ క్లోజర్ పైకి ఎక్కి లోపలికి దూకేసినట్లు చెబుతున్నారు. ఎన్ క్లోజర్ 8 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రహ్లాద్ లోపలికి దూకగానే ఎన్ క్లోజర్ లోని మగసింహం అతనిపై దాడి చేసి మెడను నోట కరవడంతో అతను చనిపోయాడు. ఈ దాడిలో అతని బట్టలు కూడా పూర్తిగా చినిగిపోయాయి. మృతుడే ప్యాంట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతను ప్రహ్లాద్ గుజ్జర్ అని రాజస్థాన్ కు చెందిన వ్యక్తి అని గుర్తించారు.
మృతుడే జేబులో ఉన్న ఫోన్ నెంబర్లకు కాల్ చేయడం ద్వారా అతను డ్రైవర్ అని రెండు నెలల కిందట ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిసిందని తిరుపతి రూలర్ సీఐ తహీం అహ్మద్ చెప్పారు. ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ అతను సెల్ఫీ కోసం వెళ్ళినట్లు అనిపించడం లేదు ఇప్పటివరకు అతని ఫోన్ ట్రేస్ కాలేదు. మృదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటాం అని చెప్పారు.