Ads
టాలెంట్ ఏ ఒక్కడి సొంతం కాదు.. అని నిరూపిస్తూ విచిత్రమైన తన ఐడియాతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు ఒక సృజనాత్మకమైన వ్యక్తి. ఐడియా అంటే అలాంటి ఇలాంటి ఐడియా కాదు. అసలు ఇలాంటి ఐడియా కూడా వస్తుందా? దీన్ని ఐడియా అంటారా? అన్న డౌట్ వచ్చే అంత ఐడియా. ఇంతకీ విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు పెళ్లి కోసం అమ్మాయి కావాలంటూ అడ్వటైజ్మెంట్ ఇచ్చాడు.. పెళ్లి కోసం ఆ అబ్బాయి తయారు చేసిన పబ్లిక్ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.
Ads
ఇంతకీ అందులో ఏముందో చూద్దాం పదండి.. నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయి ఎవరైనా సరే తన పేరు మొబైల్ నెంబర్ ఇక్కడ నమోదు చేసి వీలున్న రోజు నన్ను కలుసుకోవచ్చు. కుల పట్టింపు లేదు. నమ్మకం లేని వారు నాకు మీ వివరాలు ఇవ్వవద్దు. దానితో పాటుగా ఒక గమనికను కూడా యాడ్ చేశాడు. మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నవారు మాత్రమే తమ పేరు మొబైల్ నెంబర్ను ఇక్కడ నమోదు చేయండి.
ఇష్టం లేకపోతే నా సమయాన్ని వృధా చేయకండి. ఇట్లు దేవర నీలకంఠ అయ్యప్ప కుమార్ బీకాం అంటూ తన మనసులోని ఉద్దేశంతో కింద అడ్రస్ కూడా విచిత్రంగా ఇచ్చాడు. ఇంతకీ అతను ఇచ్చిన అడ్రస్ ఏంటో తెలుసా.. కనక నాగవరపమ్మ గుడి రోడ్, ఎంపీపీ స్కూల్ ఎదురు, బులుగు రంగు ఇల్లు, రామన్నపేట.. డిస్ప్లేలో పెట్టాడు ఈ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మరికొందరు ఆ అబ్బాయిలు నిజాయితీ ఉంది కాబట్టి మంచి అమ్మాయి దొరకాలి అని ఆశిస్తున్నారు.