Ads
ఇటీవల అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. ప్రపంచం అంతా కూడా ఈ వేడుకను చూశారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా చాలా మంది వెళ్లారు. వారిలో తెలుగు నుండి చిరంజీవి కుటుంబం, రామ్ చరణ్ కుటుంబం వెళ్లారు. రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకకి హాజరు అయ్యారు. వచ్చిన వారికి బహుమానాలు కూడా అందజేశారు.
రామ మందిరం అనేది కేవలం ఈ మధ్య వచ్చిన విషయం కాదు. ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మంది భారతీయులు కన్న కల ఇది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అయ్యేంతవరకు మాట్లాడను అని ఒక మహిళ మొక్కుకున్నారు. ఇంకా చాలా మంది చాలా విధాలుగా రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కోసం మొక్కుకున్నారు. అన్ని సంవత్సరాల కృషికి ఫలితం ఇది. ఈ పైన ఫోటో చూశారా. ఇది 1992 లో బాబ్రీ మసీదులో తీసిన ఫోటో. ఈ ఫోటోలో అప్పటి ప్రధాని మురళీ మనోహర్ జోషి ఉన్నారు. ఆయన పక్కన ఉన్న మరొక వ్యక్తి కూడా మన అందరికీ తెలిసిన వారే.
Ads
ఆయన మరెవరో కాదు, రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎంతో కృషి చేసిన వారిలో ఒకరైన నరేంద్ర మోడీ. బాబ్రీ మసీదులో ఉన్న రాముడి విగ్రహానికి పూజ చేస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది. అప్పుడు ఎవరు ఊహించి ఉండరు. మురళీ మనోహర్ జోషి పక్కన నుంచున్న వ్యక్తి పదవీకాలంలోనే రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అని. నరేంద్ర మోడీ ఈ వేడుక సమయంలో కూడా ఆహార విషయంలో ఎన్నో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
దినచర్య కూడా మార్చుకున్నారు. నేల మీద నిద్ర పోవడం, ఉప్పు ఉన్న పదార్థాలు తీసుకోకపోవడం, కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగడం వంటివి చేశారు. 11 రోజులు ఈ నియమాలని మోడీ పాటించారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మోదీ కన్నీటి పర్యంతం కూడా అయ్యారు అనే విషయాన్ని అయోధ్యలోని రాముడి గుడిలో పూజలు నిర్వహించిన పండితులు తెలిపారు. అన్ని సంవత్సరాల కృషికి ఇప్పుడు రూపం వస్తున్నందుకు ఎమోషనల్ అయ్యారు.