మీరు గ్రేట్ సార్.. కాపీ చేశా అని ఒప్పుకున్నారు.. ఇంతకీ కాపీ చేసిన ఆ సాంగ్ ఏంటంటే?

Ads

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెలుగులో ఎన్నో సినిమాలకు మంచి మంచి పాటలను అందించి సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా స్టార్ హీరోలకు సూపర్ హిట్ ఆల్బమ్ సాంగ్స్ ని కూడా అందించారు. కాగా మణిశర్మ తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ,నాగార్జున,చిరంజీవి,మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సినిమాలకు పని చేశారు.

ఇకపోతే ఒకప్పుడు సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీబిజీగా గడుపుతూ ఒక వెలుగు వెలిగిన మణిశర్మ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన హవా పూర్తిగా తగ్గిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మణిశర్మ ఇంటర్వ్యూ కు సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. మీరు మీ కెరిర్ లో ఎప్పుడైన సాంగ్ కాఫీ చేశారా అని ప్రశ్నించగా.. అయినా ఆ విషయం పై స్పందిస్తూ ఆ చేశాను. ఎన్టీఆర్ కోసం ఒక పాటని బలవంతంగా కాపీ చేశాను. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాలో చికు చికు భం భం అనే పాట కాపీ చేశాను అని ఒప్పుకున్నారు.

తనకు ఇష్టం లేక పోయినప్పటికీ బలవంతంగా ఆ పాటను కాపీ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ పాటని టర్కిష్ సాంగ్ సిమరిక్ నుంచి కాపీ చేశారు. మణిశర్మకి ఇష్టం లేకున్నా దర్శకనిర్మాతల బలవంతం మీద ఆ పాటని కంప్లీట్ గా కాపీ చేసేశారట. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తూ మీరు నిజంగా చాలా గ్రేట్ సార్.. సాంగ్ కాపీ చేశానని ఒప్పుకున్నారు రియల్లీ యువర్ గ్రేట్ సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Previous articleఈ కారణాల వల్లే…పెళ్లి అంటే “నో” అంటున్నారు అంట చాలామంది పురుషులు.! నిజమేనా.?
Next articleరికార్డ్ స్థాయిలో యాదాద్రి హుండీ ఆదాయం..! ఎంత అంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.