Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చిన్న సినిమాలు అయినా భారీ హిట్లుగా నిలుస్తున్నాయి. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న అలాంటి చిత్రమే మట్టి కథ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ మూవీ 9 అవార్డులు తన ఖాతాలో వేసుకుంది. మరి అలాంటి చిత్రం ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించడం కోసం ఓటీటీ లో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.
చిన్న కథ చిత్రంగా వచ్చి సునామీ సృష్టించిన బలగం తరహాలో ఈ మట్టి కథ మూవీ కూడా ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ప్రశంసలు అందుకోవడంతో పాటు 9 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ వైవిధ్యమైన చిత్రం అక్టోబర్ 13 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కాబోతుంది. మంచి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ చిత్రం రైతుకి అతని భూమికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎంతో అద్భుతంగా అవిష్కరిస్తుంది.
Ads
భూమయ్య,శ్రీను,యాదగిరి,రాజు కానీ నలుగురు కాలేజీ చదివే కురాళ్ళ మధ్య సాగే కథ ఈ చిత్రం. సరదాగా సాగే వారి జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది అద్భుతంగా తెరకెక్కించారు. భూమయ్య రాజు అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు కానీ సరిగ్గా అదే సమయానికి అతని జీవితంలో జరిగిన ఒక ఘటన జీవితాన్నే తలకిందులుగా మారుస్తుంది. స్నేహం ,ప్రేమ లాంటి కాన్సెప్ట్స్ తో సాగే మంచి ఎమోషనల్ మూవీ ఇది. సున్నితమైన భావాలతో ,హృదయాన్ని హత్తుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ను అసలు మిస్ కాకండి.